
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీగా తీస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే మలయాళంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న అల్లు అర్జున్ దాన్ని తమిళం, కన్నడ, హిందీలకు విస్తరించి ప్యాన్ ఇండియా స్టార్ గా స్థిరపడిపోవాలని భావిస్తున్నాడట.. ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్ సినిమా ‘పుష్ప’తో ఆ ముచ్చట తీర్చుకోబోతున్నాడు.
తాజాగా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న పుష్ప సినిమా కోసం మలయాళ నటుడు ఫాజిల్ ను తీసుకున్నారు. మంచి నటుడు అయిన ఇతడు మలయాళంలో నటనకు బోలెడు అవార్డులు అందుకున్నాడు. జాతీయ స్తాయిలో పేరొందిన ఇతడిని బన్నీకి విలన్ గా సెట్ చేశారు.
ఇలాంటి నటుడికి ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఉంటారన్న చర్చ టాలీవుడ్ లో సాగుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫాజిల్ కు అయిదు కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట.. మలయాళంలో మంచి మార్కెట్ ఉండడం.. వెబ్ సిరీస్ లో ఫాజిల్ నటించి ఉండడంతో ఆ మొత్తం పెద్ద లెక్క కాదని అంటున్నారు.
అలా బన్నీ మలయాళం మార్కెట్ తోపాటు ప్యాన్ ఇండియా లెవల్ ను ఆలోచించే ఇలా జాగ్రత్తగా నటులను ఎంపిక చేసుకుంటున్నాడని తెలుస్తోంది.