https://oktelugu.com/

Hyper Adi Sowmya Rao : రష్మీని సుధీర్ పడేసినట్లు… కొత్త యాంకర్ కి ట్రై చేస్తున్న హైపర్ ఆది! 

Hyper Adi Sowmya Rao : జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చింది. అనసూయను రష్మీ రీప్లేస్ చేస్తే రష్మీని సౌమ్య రావు రీప్లేస్ చేశారు. గత గురువారం ఎపిసోడ్ నుండి సౌమ్య రావు యాంకరింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ కొత్త యాంకర్ ని లైన్లో పెట్టేందుకు హైపర్ ఆది తెగ ట్రై చేస్తున్నాడు. ఇంకెవరికీ ఛాన్స్ ఇవ్వకుండా… ఫస్ట్ ఎపిసోడ్ నుండే స్టార్ట్ చేశాడు. ఈ విషయం సౌమ్య రావుకు తెలిసిపోయినట్లుంది. నువ్వు ఎంత పులిహోర […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2022 / 07:34 PM IST
    Follow us on

    Hyper Adi Sowmya Rao : జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చింది. అనసూయను రష్మీ రీప్లేస్ చేస్తే రష్మీని సౌమ్య రావు రీప్లేస్ చేశారు. గత గురువారం ఎపిసోడ్ నుండి సౌమ్య రావు యాంకరింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ కొత్త యాంకర్ ని లైన్లో పెట్టేందుకు హైపర్ ఆది తెగ ట్రై చేస్తున్నాడు. ఇంకెవరికీ ఛాన్స్ ఇవ్వకుండా… ఫస్ట్ ఎపిసోడ్ నుండే స్టార్ట్ చేశాడు. ఈ విషయం సౌమ్య రావుకు తెలిసిపోయినట్లుంది. నువ్వు ఎంత పులిహోర కలిపినా ప్రయోజనం లేదని చెప్పేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా… సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చారు. షార్ట్ ఫ్రాక్ ధరించి సౌమ్య సూపర్ గ్లామరస్ గా కనిపించారు. మెల్లగా ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు అనిపిస్తుంది. 
     
    అనసూయ-రష్మీ లకు ఆ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం స్కిన్ షో అని చెప్పాలి. గతంలో ఏ తెలుగు యాంకర్ చేయని సాహసం రష్మీ, అనసూయ చేసి చూపించారు. సాంప్రదాయాలు బ్రేక్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా అనసూయ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. ఆమె డ్రెస్సింగ్ పై తీవ్ర విమర్శలు తలెత్తినా అనసూయ తగ్గలేదు. మరి ఆమె వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు మెల్లగా వాళ్ళ పద్ధతులు అలవరుచుకుంటున్నారు. 
     
    కాగా హైపర్ ఆది ఒక ప్రక్క నుండి సౌమ్యను గోకే కార్యక్రమం పెట్టుకున్నాడు. సౌమ్య అల వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. సాంగ్ ముగియగానే… ఆమె వద్దకు వెళ్లి ‘నువ్వు ఒక్కదానివే డాన్స్ వేస్తే ఒట్టి బొమ్మ అవుతుంది. నాతో పాటు చేస్తేనే బుట్ట బొమ్మ అవుతుంది’ అని అన్నాడు. నువ్వు ఎంత పులిహోర కలిపినా నేను నీకు పడవు, అని సౌమ్య రావు అన్నారు. నేను ఎవరో తెలుసా? చిరంజీవి అభిమానిని అని ఆది మరో డైలాగ్ కొట్టాడు. చిరంజీవి కాదు కదా.. అంటూ సౌమ్య రావు టైమింగ్ పంచ్ వేసింది. 
     
    యాంకర్ రష్మీ వెంటపడి సుధీర్ కెరీర్ సెట్ చేసుకున్నాడు. బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు.హైపర్ ఆది స్టార్ కమెడియన్ అయినప్పటికీ సుధీర్ రేంజ్ పాపులారిటీ రాలేదు. అందుకే సుధీర్ ఫార్ములా ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు. రష్మీ తన లవర్ గా ప్రొజెక్టు చేసి సుధీర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సౌమ్యను లైన్లో పెట్టి మనం కూడా ఎదుగుదామని ఆది ప్లాన్స్ వేస్తున్నాడు అనిపిస్తుంది. కాగా జబర్దస్త్ కి ఒక్కొక్కరు తిరిగి వస్తున్నారు. దీంతో పూర్వవైభవం వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఒకప్పటి కామెడీ డోస్ జబర్దస్త్ లో ఇప్పుడు లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది.