Jaya Bachchan:పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునే పరిస్థితి ఉండేది: జయాబచ్చన్

Jaya Bachchan:‘ఆ రోజుల్లో షూటింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు మార్చుకోవడానికి చెట్ల పొదల్లోకి వెళ్లేవాళ్లం’ అంటూ సీనియర్ నటి జయా బచ్చన్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఒకప్పుడు షూటింగ్ కు వెళ్లే మహిళలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పటిలా కార్వానిలు అసలే లేవు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా కోసం పనిచేసేవాళ్లం అన్న ఆమె వ్యాఖ్యలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. […]

Written By: SHAIK SADIQ, Updated On : November 13, 2022 9:00 am

Jaya Bachan

Follow us on

Jaya Bachchan:‘ఆ రోజుల్లో షూటింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు మార్చుకోవడానికి చెట్ల పొదల్లోకి వెళ్లేవాళ్లం’ అంటూ సీనియర్ నటి జయా బచ్చన్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఒకప్పుడు షూటింగ్ కు వెళ్లే మహిళలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పటిలా కార్వానిలు అసలే లేవు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా కోసం పనిచేసేవాళ్లం అన్న ఆమె వ్యాఖ్యలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

సీనియర్ నటి, రాజ్యసభ ఎంపీ అయిన జయాబచ్చన్ 15 ఏళ్ల వయసులోనే సినీ ఎంట్రీ ఇచ్చారు. సత్యజిత్ రే తీసిన ‘మహానగర్’ తో ఆమె వెండితెరపై మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత హిందీతో పాటు బెంగాలీ చిత్రాల్లో నటించింది. ఆ తరువాత అమితాబ్ బచ్చన్ తో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఆయనను 1973లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ తరుపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇటీవల తన మనువరాలు నవ్య నవేలి నందాస్ పోడ్ కాస్ట్ ఎపిసోడ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పాతకాలం నాటి విషయాలు గుర్తు చేశారు.

‘ఆ రోజుల్లో నటీనటుల కోసం కార్వాణి వ్యాన్లు లేవు. మహిళలకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు. మేము ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లినప్పుడు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లు మార్చాల్సి వచ్చేది. దీంతో చెట్ల పొదల్లోకి వెళ్లి వాటిని మార్చుకునేవాళ్లం. ఆ తరువాత వాటిని ప్లాస్లిక్ సంచుల్లో వేసి ఇంటికి తీసుకొచ్చి చెత్తబుట్టలో వేసేవాళ్లం. ఇలా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది..’ అని ఆవేదనతో చెప్పారు.

‘ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటి ప్రత్యేక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల వారికి పీరియడ్స్ సమయాల్లో నాలుగైదు రోజులు సెలవులు ఇవ్వాలి. లేకుంటే వారి మానసికంగా కుంగిపోతారు. కొంచె శారీరకంగా కష్టపడే వారికి ఈ పరిస్థితి చెప్పరానిది. అందువల్ల పురుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వారికి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది.’ అని జయాబచ్చన్ చెప్పారు.