https://oktelugu.com/

Remuneration Of RRR Producer : గుసగుస: ఇంతకీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు నిర్మాతకు మిగిలిదెంతంటే?

Remuneration Of RRR Producer : ‘ఆర్ఆర్ఆర్’.. ప్యాన్ ఇండియానే కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమాగా విడుదలైంది. తొలి వారం కలెక్షన్ల వర్షం కురిసింది. రోజులు గడిచే కొద్దీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తగ్గిపోయాయి.. ఈ చిత్రాన్ని కొన్న పంపిణీదారులందరికీ ఇప్పటికే పెట్టిన పెట్టుబడితోపాటు భారీ లాభాలను పొందారని తెలుస్తోంది. ఈ తరుణంలో సినిమా నిర్మాతపై ఓ హాట్ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ రెమ్యూనరేషన్ తో సహా రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2022 1:15 pm
    Follow us on

    Remuneration Of RRR Producer : ‘ఆర్ఆర్ఆర్’.. ప్యాన్ ఇండియానే కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమాగా విడుదలైంది. తొలి వారం కలెక్షన్ల వర్షం కురిసింది. రోజులు గడిచే కొద్దీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తగ్గిపోయాయి.. ఈ చిత్రాన్ని కొన్న పంపిణీదారులందరికీ ఇప్పటికే పెట్టిన పెట్టుబడితోపాటు భారీ లాభాలను పొందారని తెలుస్తోంది. ఈ తరుణంలో సినిమా నిర్మాతపై ఓ హాట్ రూమర్ చక్కర్లు కొడుతోంది.

    ఆర్ఆర్ఆర్ మూవీ రెమ్యూనరేషన్ తో సహా రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది. నిర్మాత డీవీవీ దానయ్య థియేట్రికల్, ఓటీటీ హక్కులతో సహా సినిమా మొత్తాన్ని రూ.700 కోట్లకు విక్రయించారు.

    డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పెద్దగా డబ్బు సంపాదించలేదని.. కేవలం రూ.25 కోట్ల లాభం మాత్రమే గడించాడని ఒక పుకారు ఇప్పుడు టాలీవుడ్ లో షికారు కొడుతోంది. దానయ్య సినిమా కోసం ఇతరుల నుంచి మొత్తం డబ్బును తీసుకొని సినిమాపై పెట్టాడు. ఇప్పుడు వచ్చిన డబ్బులతో ఫైనాన్సియర్లందరికీ వడ్డీలతో సహా ముట్టజెప్పగా మిగిలింది రూ.25 కోట్లు మాత్రమేనని టాక్ నడుస్తోంది. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం సినిమాను ఓన్ చేసుకొని తీయడంతో లాభాల్లోంచి సింహభాగం వారే తీసేసుకున్నారనేది మరో సంచలన లీక్ బయటకొస్తోంది.

    ఏ నిర్మాత కూడా రూ.450 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే కేవలం రూ.25 కోట్ల లాభాన్ని ఆర్జించరు. కనీసం అందులో సగం లేదంటే ఓ పాతిక శాతం అయినా లాభాలు పొందాలనుకుంటారు. కానీ నిర్మాత దానయ్యకు రూ.25 కోట్లు మాత్రమే మిగిలాయన్న టాక్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది నిజమా? లేక గాసిప్ ఎవరైనా సృష్టించారో తెలియదు కానీ.. పెద్దగా లాభాలు మాత్రం దానయ్యకు రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

    అయితే రాజమౌళి సినిమాల్లో నిర్మాత కేవలం ఒక పార్ట్ మాత్రమేనని.. వచ్చిన లాభాల్లో సగం రాజమౌళి కుటుంబానే పోతాయన్న ప్రచారం టాలీవుడ్ లో ఉంది. అందుకే ఇప్పుడు దానయ్యకు ఏం మిగలలేదన్న టాక్ నడుస్తోంది. మరి ఇది నిజమా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.