జీహెచ్ఎంసీ: బీజేపీని ‘అమావాస్య’తో కొడుతున్న కేసీఆర్

సెంటిమెంట్లతో రాజకీయం చేయడం ఎలాగో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో.. అందుకే ఆయన తెలంగాణ సాధించాడు. ఆ సెంటిమెంట్ రాజేసే రెండోసారి కూడా గెలిచాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టిన చంద్రబాబు బూచీగా చూపే తెలంగాణలో కేసీఆర్ విజయం సాధించారు. సెంటిమెంట్లతో ఆడుకోవడంలో కేసీఆర్ దిట్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదే హిందుత్వ సెంటిమెంట్ తో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటడంతో […]

Written By: NARESH, Updated On : January 26, 2021 5:48 pm
Follow us on

సెంటిమెంట్లతో రాజకీయం చేయడం ఎలాగో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో.. అందుకే ఆయన తెలంగాణ సాధించాడు. ఆ సెంటిమెంట్ రాజేసే రెండోసారి కూడా గెలిచాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టిన చంద్రబాబు బూచీగా చూపే తెలంగాణలో కేసీఆర్ విజయం సాధించారు. సెంటిమెంట్లతో ఆడుకోవడంలో కేసీఆర్ దిట్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే అదే హిందుత్వ సెంటిమెంట్ తో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటడంతో కేసీఆర్ సెంటిమెంట్ పాతబడి బీజేపీ హిందుత్వ సెంటిమెంట్ పైకొచ్చింది. ఈ క్రమంలోనే దుబ్బాకలో విజయం, జీహెచ్ఎంసీలో బీజేపీ మెజార్టీ సీట్లు కొల్లగొట్టింది.

తాజాగా జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ప్రగతి భవన్ ముట్టడించి నానా హంగామా చేయడంతో ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ ఫిబ్రవరి 11న ముహూర్తాన్ని పెట్టింది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తేది ఖరారు చేసింది.

ఇప్పుడు ఈ తేది అంటేనే కొత్త కార్పొరేటర్లలో గుబులు రేగుతోంది. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి బీజేపీకార్పొరేటర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం మాత్రం సెంటిమెంట్ ఏం లేవని ఓకే అంటోంది. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎటూ తేల్చడం లేదట..

ఫిబ్రవరి 11న ప్రమాణస్వీకారం జరిగే రోజు అమావాస్య కావడమే ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజున ప్రమాణం చేస్తే శని చుట్టుకుంటుందని.. తాము కొత్తగా ఎన్నికైనందున చేయమని మొండికేస్తున్నారు. ఆరోజు గైర్హాజరు అవుతామంటున్నారు.

ఇక ఈ సెంటిమెంట్లు ఎక్కువగా నమ్మే బీజేపీ కార్పొరేటర్లు అయితే మండిపడుతున్నారు. ఎంఐఎం చెప్పినట్లు కేసీఆర్ అమావాస్యరోజున ప్రమాణస్వీకారం పెట్టాడని.. విమర్శిస్తున్నారు. తమ సెంటిమెంట్ ను ఎందుకు గౌరవించరని కేసీఆర్ ను బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఎగిరెగిరి పడుతున్న బీజేపీ కార్పొరేటర్లను అమావాస్యతో ఇరికించి కేసీఆర్ చోద్యంచూస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.