https://oktelugu.com/

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్ల దాడి.

తెలంగాణకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్ల యాచారం మండలం మేడపల్లి గ్రామంలో చెరువు నిండడంతో పూజలు చేసేందుకు గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చారు. ఈక్రమంలో ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆయనను స్థానికులు నిలదీసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 15, 2020 / 01:04 PM IST
    Follow us on

    తెలంగాణకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్ల యాచారం మండలం మేడపల్లి గ్రామంలో చెరువు నిండడంతో పూజలు చేసేందుకు గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చారు. ఈక్రమంలో ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆయనను స్థానికులు నిలదీసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మాసిటీతో మేడిపల్లి గ్రామం పోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.