‘సంగీత దర్శకుడు తమన్’ కాపీ కొట్టడం తన జన్మ హక్కుగా పెట్టుకున్నట్లు ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు తమన్. పాపం తమన్ ఎంతో కష్టపడి ఒక పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతున్నారు నెటిజన్లు. తాజాగా ‘సర్కారు వారి పాట’లోని మ మ మహేషా సాంగ్ ను, అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలోని పాటకి లింక్ పెడుతూ కాపీ పేరుతో ట్రోల్స్ చేస్తున్నారు. పైగా దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు.
నిజానికి ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘మ మ మహేషా సాంగ్’ మంచి విజయం సాధించింది. సినిమాకి కొత్త ఊపుని తీసుకొచ్చింది. పైగా సినిమా పై హైప్ ని కూడా భారీగా పెంచేసింది. ఇలాంటి పాట కూడా కాపీనే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. సరైనోడు చిత్రంలో సై సై అంటూ అంజలితో కలిసి బన్నీ ఒక స్పెషల్ సాంగ్ చేశాడు. ఈ పాట ట్యూన్ ని, మ మ మహేషా పాట ట్యూన్ ని ఒకేలా ఉన్నాయి.
ఈ రెండు పాటల ట్యూన్లను తమన్ కాస్త అటు ఇటు మార్చి కొట్టారని ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. తమన్ మళ్లీ కాపీ ఎలా కొట్టావయ్యా ? అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక విషయం ఉంది. సరైనోడు సినిమాకి కూడా తమనే సంగీతం అందించాడు. మొత్తానికి తన పాటనే తాను కాపీ కొట్టి అడ్డంగా బుక్ అయ్యాడు. ఒకే పాటను ఇటు మహేష్ కి, అటు బన్నీకి కొట్టి, తమన్ తమ హీరోలను చీట్ చేశాడని ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అసలు తమన్ నుంచి ఎలాంటి పాట వచ్చినా.. అది ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ కొట్టినట్టు సాక్ష్యాలు దొరకడమే ఇక్కడ కొసమెరుపు. పాపం తమన్.