https://oktelugu.com/

Gangotri movie Child Artist : ‘గంగోత్రి’ సినిమాలోని వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

Gangotri movie Child Artist :  అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.కానీ అతడి తొలి సినిమాలో లుక్ చూసి అసలు హీరోనే కాదన్నారు. అంతలా బన్నీ లుక్ ఉండేది. ఈ సినిమాలో మెరిసిన బాల నటి అప్పుడు క్యూట్ గా స్వీట్ గా ఉండేది. ‘వల్లంకి పిట్టా’ అని ఆమె పాడిన పాట నాడు వైరల్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా చేసి ఆ తర్వాత హీరోలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2022 / 10:06 PM IST
    Follow us on

    Gangotri movie Child Artist :  అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.కానీ అతడి తొలి సినిమాలో లుక్ చూసి అసలు హీరోనే కాదన్నారు. అంతలా బన్నీ లుక్ ఉండేది. ఈ సినిమాలో మెరిసిన బాల నటి అప్పుడు క్యూట్ గా స్వీట్ గా ఉండేది. ‘వల్లంకి పిట్టా’ అని ఆమె పాడిన పాట నాడు వైరల్ అయ్యింది.

    తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా చేసి ఆ తర్వాత హీరోలు, హీరోయిన్లుగా ఎదిగారు. అలా దర్శకేంద్రుడి 100వ సినిమా ‘గంగోత్రి’లో కూడా ఓ చిన్న బాలనటి అందరికీ గుర్తుండిపోయింది. అల్లు అర్జున్ చిన్నప్పుడు పాడే ‘వల్లంకి పిట్ట’ పాటలో చిన్నారి కావ్య అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ మాయ చేసింది కావ్య. గంగోత్రి సమయంలో ఆమె వయసు 4 ఏళ్లు మాత్రమే.

    ఇప్పుడీ కావ్య పెద్దదైంది. 22 ఏళ్లకు చేరింది. గంగోత్రి వచ్చి 18 ఏళ్లు గడిచిపోయింది. దాంతో కావ్య ఇప్పుడు హీరోయిన్ చాన్సులు కొట్టేసింది. ఇప్పుడీ వల్లంకి పిట్ట గర్ల్ హీరోయిన్ కావ్యగా మారింది. గంగోత్రి తర్వాత కొన్ని చిత్రాల్లో చేసినా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో కావ్య తల్లిదండ్రులు ఆమెను కొన్ని రోజులు సినిమాలకు దూరం చేసి చదివించారు.

    ఈ మధ్యే చదువు పూర్తి చేసుకున్న కావ్య.. సినిమాల వైపు చూస్తోంది. రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది. కావ్య ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

    కావ్య అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో సినిమాల్లో ఈమెకు ప్లస్ అవుతోంది. అప్పట్లో నటించిన చిన్నారి బాలనటులంతా ఇప్పుడు హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. దేవుళ్లు చిత్రంలో నటించిన చిన్నారి ‘నిత్యశెట్టి’ ఈ మధ్యే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ పిట్టకథతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇప్పుడు వల్లంకి పిట్ట ‘కావ్క్ష్’ కూడా ఎంట్రీకి సిద్ధమైంది.
    Recommended Videos