Sukumar Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో తన వంతు కృషి అయితే చేస్తున్నాడు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా లాజిక్ తో మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న దర్శకుడుగా కూడా సుకుమార్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్న సుకుమార్ ఇక ఇప్పుడు పుష్ప 2 తో మరొకసారి పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతున్నాడు.
అల్లు అర్జున్ కి, సుకుమార్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక సుకుమార్ మొదటి సినిమా అయిన ఆర్య అల్లు అర్జున్ తో చేసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది అప్పటినుంచే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వస్తున్న పుష్ప 2 తో కలిపి వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చాయి అంటే మామూలు విషయం కాదు.
అయితే సుకుమార్ అల్లు అర్జున్ ని ముద్దుగా బన్నీ అని పిలిస్తే అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ ని ‘రాజా మార్తాండా ‘ అని పిలుస్తాడట అది కూడా వాళ్ల క్లోజ్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని అలా పిలుస్తాడని తెలుస్తుంది. సుకుమార్ కి అలా పిలిపించుకోవడం ఇష్టం లేకపోయిన బన్నీ మాత్రం సుక్కు ను ఆటపట్టించడానికి అలా పిలుస్తాడని మరికొందరు చెబుతున్నారు.
నిజానికి బన్నీ చాలా జోవియల్ గా ఉంటూ అతని ఫ్రెండ్స్ ని గాని, అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గానీ ఎప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా సెట్ లో అయితే ఎనర్జిటిక్ గా ఉంటూ అందరిని ఆక్టివేట్ చేస్తూ ఉంటాడని అతనితో పని చేసిన చాలా మంది సినిమా డైరెక్టర్లు కూడా తెలియజేశారు. ఇక మొత్తానికైతే సుకుమార్ ని ఆటపట్టించడానికే బన్నీ అలా పిలుస్తాడంటు వాళ్ళిద్దరితో పాటు క్లోజ్ గా ఉండే మరి కొంతమంది చెప్తున్నారు…మొత్తానికైతే వాళ్ల ఫ్రెండ్షిప్ లో ఉన్న క్లోజ్ నెస్ కి ఇదొక ఉదాహరణ అనే చెప్పాలి…