CM Jagan: విజయదశమి నుంచి విశాఖలో పాలన ప్రారంభించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా విశాఖ నుంచి పాలన తధ్యం అని తేల్చి చెప్తున్నారు. ముహూర్తం కంటే ముందుగానే విశాఖకు వచ్చి వాలుతున్నారు. ఈనెల 19న కుటుంబ సభ్యులతో కలిసి క్యాంప్ ఆఫీస్ లో పూజలు చేస్తారని సైతం ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేటి విశాఖ జిల్లా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రాజధానికి వచ్చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వనున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ గా ప్రచారం జరుగుతున్న రిషికొండ పర్యాటక ప్రాంతంలో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ సొంత మనసులు వచ్చి మరి పనులు జరిపిస్తున్నారు. అత్యాధునిక నిర్మాణాలు జరుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 19న సీఎం కుటుంబ సభ్యులతో పాటు ఎక్కడ పూజలు చేస్తారని టాక్ నడుస్తోంది. 24 నుంచి మూడు రోజులు పాటు ఒక్కటే గడుపుతారని ప్రచారం సాగుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇంతవరకు లేదు. ఎప్పటికీ సీఎం క్యాంప్ ఆఫీస్ తరలింపునకు సంబంధించి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కీలక శాఖలకు సంబంధించి తరలింపు పై అధికారులతో కూడిన కమిటీ నివేదిక ఇవ్వనుంది. దానిని అనుసరించి ఏయే శాఖలను తరలించాలి అన్నదానిపై ఒక క్లారిటీ రానుంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. విశాఖలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2 లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఫార్మా సిటీలో కొత్తగా నిర్మించిన యూజీఏ స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారెన్స్ ల్యాబ్స్ లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ ఎస్ పి ఎల్ యూనిట్ టూ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు.అక్కడినుంచి హెలిక్యాప్టర్లో మధురవాడ ఐటి హిల్స్ కి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్కు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం అనకాపల్లి జిల్లాకు హెలికాప్టర్లలో వెళ్ళనున్నారు.
విశాఖ నుంచి పాలనకు సంబంధించి నేడు జగన్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రిషికొండపై జరుపుతున్న నిర్మాణాలు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని ప్రచారం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని ఏనాడూ చెప్పలేదు. మరోవైపు సీఎం ప్రకటించిన విజయదశమి గడువు ముంచుకొస్తోంది. అంతకంటే ముందే సీఎం జగన్ కుటుంబ సభ్యులతో అక్కడ పూజలు చేస్తారని ఒక ప్రచారం ఉంది. ఇటువంటి తరుణంలో ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజ్ ఉంది. నేటి పర్యటనలో దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.