Dhurandhar 2 Teaser: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ఓటీటీ లో విడుదలై రెండు రోజులు అవుతోంది. అయినప్పటికీ కూడా బుక్ మై షో లో ట్రెండ్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 900 కోట్ల నెట్ క్లబ్ కి అతి చేరువలో ఉన్న ఈ చిత్రం , ఈ వారం లో ఆ ప్రతిష్టాత్మక క్లబ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం హిందీ వెర్షన్ లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని పిచ్చిగా ఇష్టపడిన ప్రేక్షకులు, సీక్వెల్(Dhurandhar 2 Movie) కి సంబంధించిన అప్డేట్స్ కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.
మొదటి భాగం క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని మార్చి 19 , 2026 లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎలాంటి చప్పుడు చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నెల 22న విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇకపోతే రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల నుండి బలంగా వినిపిస్తున్న విషయం. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ ని హిందీ తో పాటు తెలుగు, తమిళం , మలయాళం భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా టీజర్ చివరి 20 సెకండ్స్ లో డైరెక్టర్ ఆదిత్య డర్ ఇచ్చే ట్విస్టులను చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అని బాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త. చూడాలి మరి ఈ టీజర్ ఈ చిత్రం పై ఇంకా ఎలాంటి అంచనాలను పెంచబోతుంది అనేది.
ఇకపోతే మొదటి భాగం లో హంజా రెహమాన్ డెకాయిట్ ని చంపేసిన తర్వాత ‘ల్యారీ’ కి కింగ్ లాగా మారిపోతాడు. ఇక కరాచీఎలాగో తన మామ చేతుల్లోనే ఉంటుంది. ఈ రెండిటిని తన కంట్రోల్ లో పెట్టుకొని పాకిస్థాన్ లో టెర్రరిజాన్ని అంతం చేయడానికి హంజా రాజకీయంగా ఏ స్థాయికి వెళ్ళాడు, ఎంతమంది విద్రోహులను చంపాడు అనేదే రెండవ భాగం లో చూపించబోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి , మన భారతదేశానికీ చెందిన స్పై, పాకిస్తాన్ ని ఏలుతూ, అక్కడి టెర్రరిజాన్ని ఎలా అనే ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది కదూ. మొదటి భాగాన్ని డైరెక్టర్ ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించాడో మనమంతా చూసాము. రెండవ భాగం లో అంతకు మించిన బలమైన స్టోరీ సెటప్ ఉంది. ఇక ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని తీర్చి దిద్ది ఉంటాడో మీరే ఊహించుకోండి.