Devi Sri Prasad Marriage: ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే కథ డైరెక్షన్ తో పాటు ఆ మూవీకి మంచి మ్యూజిక్ కూడా ఉండాలి. అలాంటప్పుడే ఆ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కొంతమంది పాటలను చూడడానికి కూడా థియేటర్ కి వచ్చేవాళ్ళు ఉంటారు. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా పాటలను ఎంజాయ్ చేయాలని బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని కూడా సినిమాలను చూసే ప్రేక్షకులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన దాదాపు 26 సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన దైన రీతిలో సత్తా చాటుతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్న దేవి ప్రస్తుతం హీరోగా మారాడు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ సైతం హీరోగా మారిపోవడంతో తన మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతాడా? లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.
ఇక ఏది ఏమైనా కూడా దేవి శ్రీ ప్రసాద్ ఎప్పటినుంచో హీరో అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి అది ఇప్పటివరకు నెరవేరలేదనే చెప్పాలి. గతంలో ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు రాఖీ సినిమా సమయంలో ఛార్మి ని లవ్ చేశాడు.
తను కూడా తనను లవ్ చేసింది. మొత్తానికైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారనుకున్న సందర్భంలోనే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సపరేట్ అయిపోయారు. ఇక ఏది ఏమైనా కూడా ఆ తర్వాత నుంచి దేవిశ్రీప్రసాద్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇక ఇప్పటికైనా తను పెళ్లి చేసుకుంటాడా? లేదా అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు…
ఇక ఆ తర్వాత ఇంకో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసినా కూడా అది కూడా వర్కౌట్ కాలేదంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా తన తోటి మ్యూజిక్ డైరెక్టర్లందరు పెళ్లి చేసుకుంటుంటే తను మాత్రం ఒంటరిగానే ఉండిపోతున్నాడు. ఇక ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలి…