NTR: ఆ అసంతృప్తే ఎన్టీఆర్ ను చరిత్రలో నిలిచేలా చేసింది…

-ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు — కర్ణ (1963) & దాన వీర శూర కర్ణ (1977) ~~ NTR: 1963లో తమిళ తెలుగు భాషల్లో విడుదలైన పౌరాణిక చిత్రం కర్ణ. రెండు ప్రాంతాల్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. కర్ణ పాత్రలో నటించిన శివాజీ గణేశన్ కు చాలా మంచిపేరు వచ్చింది. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉన్నా శివాజీ గణేశన్ కి వచ్చినంత పేరు ఎన్టీఆర్ కి రాలేదు. ఇది ఎన్టీఆర్ కి […]

Written By: NARESH, Updated On : January 27, 2022 5:23 pm

NTR

Follow us on

-ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు — కర్ణ (1963) & దాన వీర శూర కర్ణ (1977) ~~

NTR: 1963లో తమిళ తెలుగు భాషల్లో విడుదలైన పౌరాణిక చిత్రం కర్ణ. రెండు ప్రాంతాల్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. కర్ణ పాత్రలో నటించిన శివాజీ గణేశన్ కు చాలా మంచిపేరు వచ్చింది. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉన్నా శివాజీ గణేశన్ కి వచ్చినంత పేరు ఎన్టీఆర్ కి రాలేదు. ఇది ఎన్టీఆర్ కి బాగా అసంతృప్తి కలిగించింది.

NTR:

ఏనాటికైనా తాను కర్ణ పాత్ర పోషించి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలన్న బలమైన సంకల్పం ఎన్టీఆర్ లో ఏర్పడింది. ఇది 1977లో కార్యరూపం దాల్చింది దాన వీర శూర కర్ణ చిత్రం ద్వారా. ఎంతో శ్రమించి ప్రత్యేకమైన శ్రద్ధతో కర్ణ పాత్రను రూపొందించిన చిరస్మరణీయ పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. ఇందులో ఎన్టీఆర్ మహానటన, డైలాగులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూశాం.

Also Read:  షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిన ‘పవర్ స్టార్’ సినిమాలు..!

మహాభారతంలో కర్ణుడి ఔన్నత్యాన్ని చాటి చెబుతూ మరికొంత ముందడుగు వేసి వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే కథానాయకునిగా నిలబెట్టి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. సంపూర్ణ మానవతావాదిగా, వీరునిగా, శూరునిగా కర్ణ పాత్రను తీర్చిదిద్ది ఆ పాత్రకి ఓ ప్రత్యేకత ఆపాదించారు. ఇంకా చెప్పాలంటే కర్ణుని లోని మంచి గుణాలకు ఆదనంగా మరికొన్ని జోడించారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ చాలా హుందాగా, గంభీరంగా కొంత శాంతంగా కూడా దర్శనమిస్తారు.

పౌరాణిక ఇతిహాసం ప్రకారం శివాజీ గణేశన్ కర్ణ చిత్రంలో దొర్లిన కొన్ని లోపాలను దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ సరిచేశారు. ఎంతో శ్రమించి శోధించి తీసిన ఈ చిత్రానికి మరో భారీ పౌరాణిక చిత్రం కురుక్షేత్రం అడ్డు తగిలింది. ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయడానికి ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు చిత్రాలు పోటీపడి 1977లో ఒకేరోజు విడుదల అయ్యాయి. కురుక్షేత్రం విజయం సాధించలేదు. దాన వీర శూర కర్ణ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్ కష్టం మర్చిపోయేలా చేసింది. శ్రీకృష్ణ పాండవీయం తర్వాత పదకొండు సంవత్సరాలకి.‌. ఎన్టీఆర్ కి మరోసారి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం దాన వీర శూర కర్ణ. ఈ చిత్రం కర్ణుడి ప్రతిష్టని మరో లెవల్ కి తీసుకెళ్ళిన చిత్రంగా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది..

-శెనార్తి…

Also Read: ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇదొక్కటే పరిష్కారం !