అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో తమ పేర్లు కానీ.. తమ ఫొటోలు కానీ ఉండాలని చూస్తుంటుంది. అదేదో సంక్షేమ పథకాల పైనే అయితే బాగుండేది కానీ.. చివరకు డెత్ సర్టిఫికెట్ల పైన కూడా ఆ సీఎం ఫొటో వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి..!
Also Read: ఉల్లిగడ్డ భారం: తెలుగు రాష్ట్రాల ‘ఉల్లి’ కన్నీరు
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన నవ్వుతున్న ఫొటోను కనిపిస్తుంటుంది. అయితే.. ఇప్పటివరకు బర్త్, డెత్ సర్టిఫికెట్లు, పిల్లలకు అందించిన స్కూల్ బ్యాగ్స్‌పైన జగన్ బొమ్మ చూడగా.. ఇప్పుడు ఊహించని విధంగా మరోచోట జగన్ ఫొటో చూడబోతున్నాం. ఇది విన్న ప్రజలు ముక్కున వేసుకున్నంత పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టాలని నిర్ణయించింది. అయితే.. సర్వేలో భాగంగా భూముల సరిహద్దులు తెలిపేందుకు పాతే రాళ్లపై జగన్ బొమ్మను చెక్కబోతున్నారట. ఆ హద్దు రాళ్లకు స్పెషల్ డిజైన్ సిద్ధం చేశారు. రాయికి ఓ వైపు ఏపీ ప్రభుత్వ బొమ్మ.. మరో వైపు సీఎం జగన్ బొమ్మను చెక్కారు. వీటిని శాంపిల్‌గా మీడియాకు కూడా లీక్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు.. భూసర్వే ఎలా చేయాలో అధికారులు ఓ క్లారిటీ కూడా వచ్చింది.
Also Read: అమరావతి పునాదికి ఐదేళ్లు
సీఎం అనుమతి మేరకు హద్దు రాళ్లను పొలాల్లో పాతడానికి తీసుకెళ్తారు. అయితే జగన్ తాజాగా నిర్వహించే రివ్యూలో అధికారులు ఈ డిజైన్ రాళ్లను ప్రదర్శించనున్నారు. మరి వాటిని చూసిన జగన్ తన బొమ్మను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తారా..? లేక తొలగించమంటారా..? అనేది ప్రశ్నలా ఉంది. అధికారులు మాత్రం తన బొమ్మ ఏర్పాటు చేయడంపై జగన్ సంతోషం వ్యక్తం చేస్తారనే అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలోని ప్రతీ పొలంలోనూ జగన్ బొమ్మ కనిపించడం ఖాయం.