https://oktelugu.com/

కేసీఆర్ వ్యూహం ఫలించేనా..?

      సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో.. ఎవరితో స్నేహం చేస్తారో చెప్పడం కూడా అంత ఈజీ కాదు. టిఆర్ఎస్ కు తప్ప మరో ప్రత్యర్థి పార్టీకి తెలంగాణలో అవకాశమే లేదని , అధికారం ఎప్పటికీ టిఆర్ఎస్ వైపే ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితాలు తలకిందులు కావడంతో,  వాస్తవ పరిస్థితి ఏమిటనేది కేసీఆర్ కు బాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 08:50 AM IST
    Follow us on

         

    సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో.. ఎవరితో స్నేహం చేస్తారో చెప్పడం కూడా అంత ఈజీ కాదు. టిఆర్ఎస్ కు తప్ప మరో ప్రత్యర్థి పార్టీకి తెలంగాణలో అవకాశమే లేదని , అధికారం ఎప్పటికీ టిఆర్ఎస్ వైపే ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితాలు తలకిందులు కావడంతో,  వాస్తవ పరిస్థితి ఏమిటనేది కేసీఆర్ కు బాగా తెలిసొచ్చింది.

    Also Read: తెలంగాణకు బాహుబలి దొరికినట్లేనా..?

    నాయకులను, అధికారులను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యటనలు చేపట్టి , వాస్తవ పరిస్థితులను అంచనా వేసి,  ప్రజల నాడి ఏంటనేది తెలుసుకుని ముందుకు వెళ్లాలని అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

    గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతుండడంతో, గ్రేటర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని, సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: దేశంలో.. తెలంగాణలో ‘హస్త’ వ్యస్తం

    బీజేపీ దూకుడు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు చెందిన నాయకులంతా క్యూ కట్టే పనిలో ఉన్నారు. వారితో పాటు టిఆర్ఎస్ కు చెందిన చాలామంది నాయకులు వివిధ రకాల అసంతృప్తితో పార్టీ పై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.  క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఇంటలిజెన్స్ రిపోర్ట్  కేసీఆర్ అందినట్లు సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    కేసీఆర్ జిల్లాల వారీగా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  పరిస్థితి చేజారిపోతూ ఉండడంతో జిల్లాల పర్యటన చేపట్టి,  ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, ప్రజలకు మరింతగా చేరువ అయ్యి బలపడాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.