https://oktelugu.com/

ChandraBabu Naidu Wedding Card: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?

ChandraBabu Naidu Wedding Card : టాలీవుడ్ దిగ్గజం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ కూతురును వివాహం చేసుకొని చంద్రబాబు నక్క తోక తొక్కాడు. ఏకంగా మామను పక్కకు తోసి టీడీపీ పగ్గాలు చేపట్టి నాటి నుంచి నేటి వరకూ ఏపీకి సీఎంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు పిల్లనిచ్చాడు నాడు ఎన్టీఆర్. అనంతరం తన పార్టీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్భంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2022 / 02:40 PM IST
    Follow us on

    ChandraBabu Naidu Wedding Card : టాలీవుడ్ దిగ్గజం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ కూతురును వివాహం చేసుకొని చంద్రబాబు నక్క తోక తొక్కాడు. ఏకంగా మామను పక్కకు తోసి టీడీపీ పగ్గాలు చేపట్టి నాటి నుంచి నేటి వరకూ ఏపీకి సీఎంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు పిల్లనిచ్చాడు నాడు ఎన్టీఆర్. అనంతరం తన పార్టీలోకి తీసుకున్నారు.

    ChandraBabu Naidu Wedding Card And Dowry Issue Hul Chals In Social Media

    సెప్టెంబర్ 10వ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్భంగా అప్పటి ఆయన పెళ్లికార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో తన వివాహం అని చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆ కార్డులో ఉంది.

    Also Read: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?

    చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అప్పటికే చంద్రబాబు నాడు ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. దీంతో ఈ పెళ్లికి సినీ, రాజకీయ వర్గాల్లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. రాజకీయ ప్రముఖులు, సినీ తారలంతా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

    ఇక కట్నం విషయానికి వస్తే.. చంద్రబాబు తీసుకున్న కట్నం గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కానీ చంద్రబాబు నయా పైసా కట్నం మామ ఎన్టీఆర్ నుంచి తీసుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబు అడిగింది లేదట.. ఎన్టీఆర్ ఇచ్చింది లేదట.. ఇప్పుడూ ఈ రెండు కుటుంబాల మధ్య కట్నం అనే ప్రస్తావనే వినిపించలేదట.. కానీ వివాహాన్ని మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారు.

    నాడు చంద్రబాబు స్వయంగా తన పెళ్లికి ఆహ్వానించిన లేఖ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతోంది. నాటి పసుపుపచ్చని పాత రాతలో ఈ లేఖ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

    Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?