https://oktelugu.com/

చిక్కుల్లో బీజేపీ.. కేంద్రమంత్రిపై సీరియస్ ఆరోపణలు

అవినీతి విషయంలో కాంగ్రెస్ వారు ముందా? లేక బీజేపీ వారా? అంటే ఖచ్చితంగా ఇందులో మరో డౌట్ లేకుండా కాంగ్రెసోళ్లే ఫస్ట్ అంటారు. నాడు కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుంభకోణాలు ఆగిపోయాయి. ఎందుకంటే బీజేపీ నేతల్లో కొంత అలాంటి భావాలు తక్కువే.  ఆర్ఎస్ఎస్, క్షేత్రస్థాయి నుంచి బీజేపీ భావజాలంతో వస్తున్న నేతలు కావడంతో వీరిపై అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు పెద్దగా వెలుగుచూడలేదు.  అయితే తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై ఓ షూటర్ సంచలన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2020 / 12:37 PM IST
    Follow us on

    అవినీతి విషయంలో కాంగ్రెస్ వారు ముందా? లేక బీజేపీ వారా? అంటే ఖచ్చితంగా ఇందులో మరో డౌట్ లేకుండా కాంగ్రెసోళ్లే ఫస్ట్ అంటారు. నాడు కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుంభకోణాలు ఆగిపోయాయి. ఎందుకంటే బీజేపీ నేతల్లో కొంత అలాంటి భావాలు తక్కువే.  ఆర్ఎస్ఎస్, క్షేత్రస్థాయి నుంచి బీజేపీ భావజాలంతో వస్తున్న నేతలు కావడంతో వీరిపై అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు పెద్దగా వెలుగుచూడలేదు.  అయితే తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై ఓ షూటర్ సంచలన ఆరోపణలు చేయడం కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది..

    Also Read: జగనన్న ఇల్లు ఎంతో తెలుసా..?

    కేంద్రమంత్రి స్మృతి ఇరానీపైన, ఆమె ఇద్దరు సన్నిహితుల పైన షూటర్ వర్తికా సింగ్ కోర్టుకు ఎక్కడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.. జాతీయ మహిళా కమిషన్ లో నిన్ను సభ్యురాలిని చేస్తానని.. అందుకు డబ్బులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని వర్తికా ఆరోపించింది. దీనిపై సుల్తాన్ పూర్ కోర్టు జనవరి 2న విచారణ జరుపనున్నట్టు తెలిపింది. స్మృతి ఇరానీకి సన్నిహితులైన విజయ్ గుప్తా, రజినీష్ సింగ్ అనే వ్యక్తులు తనకు మహిళా కమిషన్ లో ఈ పదవిని ఇస్తామని.. ఇందుకు కోటి రూపాయలు డిమాండ్ చేశారని.. చివరకు రూ.25 లక్షలకు దిగివచ్చారని వర్తికాసింగ్ ఆరోపించారు. తనకు ఓ ఫేక్ లెటర్ పంపారని కూడా ఆమె ఆరోపించింది. వారి అవినీతిని బయటపెడుతానని హెచ్చరించినందుకే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని వర్తికా ఆరోపిస్తోంది.అయితే ఈ ఆరోపణలను విజయ్ గుప్తా ఖండించారు. వర్తికాసింగ్ పైనే అమేథీ జిల్లా పోలీసులకు పిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు వర్తిక భంగం కలిగిస్తోందని ఆరోపించాడు. పోలీసులు ఈ కేసుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

    Also Read: ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.2.67 లక్షలు తగ్గింపు..?

    అయితే ఇది రాజకీయంగా బీజేపీ కేంద్రమంత్రిని టార్గెట్ చేయడమా. లేక నిజంగానే స్మృతి ఇరానీ అనుచరులు ఇలా చేశారా అన్నది నిగ్గు తేలాల్సి ఉంది.  అయితే ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.