Balayya Mokshajna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడనే వేదన ప్రతి అభిమానిని వెంటాడుతుంది. నందమూరి కుటుంబానికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. వారందరూ వారసత్వం కోరుకుంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ లో ఒక వర్గం వారసత్వం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. వారు జూనియర్ ఎన్టీఆర్ ని నిజమైన వారసుడిగా అంగీకరించం లేదు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న చేదు నిజం. ఒక దశలో ఎన్టీఆర్ ని తొక్కేయాలని నందమూరి కుటుంబమే తెర వెనుక కుట్రలు చేశారు. ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఎగ్జిబిటర్స్ ని బెదిరించారు.
తారకరత్నను హడావుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన కారణం కూడా అదే అంటారు. ఎన్టీఆర్ స్టార్ గా ఎదగకుండా నియంత్రించాలనే ఆలోచనలతో తారకరత్నను భారీగా లాంచ్ చేశారు. అరంగేట్రంతోనే తొమ్మిది సినిమాలు తారకరత్న ఆరంభించినట్లు సమాచారం. అప్పట్లో ఇది పెద్ద న్యూస్ అయ్యింది. మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. కానీ వారసత్వం ఒక్కటే సరిపోదు. టాలెంట్ లేకుండా అభిమాన వర్గం కలకాలం మోయలేదు.
అన్ని విధాలా హీరో మెటీరియల్ అయిన ఎన్టీఆర్ టీనేజ్ కే మాస్ హీరోగా ఎదిగాడు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కి చెక్ పెట్టాలంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ రంగంలోకి దిగాలని బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ డిమాండ్. అయితే మోక్షజ్ఞ మీన మేషాలు లెక్కబెడుతున్నాడు. మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నా ముఖానికి మేకప్ వేసుకోవడం లేదు. అయితే 2023లో మోక్షజ్ఞ హీరోగా మారడం ఖాయమే అంటున్నారు.
మోక్షజ్ఞ నటుడిగా మారేందుకు ఓకే చెప్పారట. దీంతో మోక్షజ్ఞకు బాలయ్య ట్రైనింగ్ మొదలుపెట్టాడట. దీనిలో భాగంగా రోజూ సెట్స్ కి తీసుకెళుతున్నాడట. వీరసింహారెడ్డి, ఎన్బీకే 108 సెట్స్ లో మోక్షజ్ఞ తరచుగా కనిపిస్తున్నాడు. అందుకు కారణం అదే అంటున్నారు. కెమెరా యాంగిల్స్, నలుగురిలో బెరుకు లేకుండా ఎలా నటించాలి, డైలాగ్ చెప్పాలి… ఇలా నటనకు సంబంధించిన పలు విషయాల్లో అవగాహన వచ్చేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారట. కాగా కొద్ది రోజుల క్రితం బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ఉంటుంది అన్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం నేనే వహిస్తానన్న బాలకృష్ణ… ఆ మూవీతోనే మోక్షజ్ఞను పరిచయం చేయనున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.