Pawan Kushi movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ అప్పట్లో ఎలాంటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని సృష్టించిందో, ఇప్పుడు కూడా రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..కేవలం మొదటి రోజే నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 5 రోజులకు కలిపి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది..ఆ రెండు కోట్ల రూపాయిలు ఈ సినిమా కేవలం మొదటి రోజే సాధించి బ్రేక్ ఈవెన్ అయ్యింది..రెండవ రోజు నుండి లాభాలే లాభాలు..ఇక ఈ సినిమా ఇప్పటికి కూడా సాయంత్రం మరియు రాత్రి షోలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ మల్టీ ప్లెక్స్ షోస్ గురించి ప్రధానం గా మాట్లాడుకోవాలి.
ఈ సినిమా గచ్చిబౌలి ప్రాంతం లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘AMB సినిమాస్’ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..విడుదలైన రోజు నుండి నేటి వరకు ఈ చిత్రం అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూనే ఉంది..ఈరోజు కూడా రెండు ఆటలు హౌస్ ఫుల్ అయ్యాయి..అలా ఇప్పటి వరకు ఈ చిత్రం అక్కడ 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
సుమారుగా 6 నుండి 7 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి..ఇలాగే ఈ వీకెండ్ కూడా ఉంచితే ఎన్ని షోస్ అయినా హౌస్ ఫుల్ అయ్యిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..మరి ఈ రికార్డు ని ఎల్లుండి విడుదల కాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం ‘ఒక్కడు’ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి..ప్రస్తుతానికి అయితే ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చాలా పూర్ గా ఉన్నాయి.