spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు షూటింగ్ స్పాట్ లోనే ప్రధమ చికిత్స అందించి , అనంతరం ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు , చిన్నపాటి సర్జరీ అవుతుందని సూచించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని , ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాసేపటి క్రితమే డాక్టర్లు బాలయ్య ఆరోగ్య పరిస్థితి పై కీలక బులిటెన్ విడుదల చేశారు. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అభిమానుల్లో చిన్నపాటి కంగారు మొదలైంది. ప్రమాద తీవ్రత అర్థం చేసుకొని ఆందోనళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలయ్య ని పరీక్షించిన తర్వాత ఎడమ మోకాలి దగ్గర రక్తం గడ్డకట్టినట్టు గుర్తించామని, వాపు వచ్చిందని వెల్లడించారు. అదే విధంగా మోకాలి కండరాలు ఏమైనా చిరిగిందేమో అని అనుమానిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన్ని ఆయన్ని ఆర్థోపెడిక్ డాక్టర్లు దగ్గరుండి చూసుకుంటున్నారట. అంతే కాకుండా అనేక పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. బాలయ్య పాత ఆరోగ్య రికార్డులను కూడా పరిశీలించిన తర్వాత , అతనికి సర్జరీ చేయొచ్చు అనే నిర్ధారణకు వచ్చారని, తద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సురక్షితమైన వైద్యం అందించేందుకు వేర్వేరు విభాగాలకు సంబంధించిన డాక్టర్ల టీం పర్యవేక్షిస్తుందని AIG హాస్పిటల్స్ డాక్టర్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , ఆయన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొన్నారు. మోకాలు వాచి , రక్తం గడ్డ కట్టే రేంజ్ లో ఈ ప్రమాదం జరిగింది అనే విషయం అర్థం అయ్యాక అభిమానుల్లో ఒక టెన్షన్ మొదలైంది.

డాక్టర్లు ఎలాంటి భయం అక్కర్లేదని చెప్తున్నప్పటికీ కూడా, ఎంతైనా అభిమానులు కదా, ఈ రేంజ్ ప్రమాదం జరిగిందంటే ఆ మాత్రం భయం ఉండడం సహజమే. అయితే పెద్ద గాయమే అయ్యిందనే విషయం అర్థం అవుతోంది కాబట్టి NBK111 షూటింగ్ ఒక నెల రోజుల పాటు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే , కచ్చితంగా ఈ చిత్రాన్ని దసరా కి దింపాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కానీ ఇప్పుడు షూటింగ్ ఆగిపోవడం తో , ఈ ఏడాది విడుదల దాదాపుగా కష్టమే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper