Balakrishna And Gopichand Malineni: నందమూరి నటసింహంగా తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న నటుడు బాలయ్య బాబు…రీసెంట్ గా వచ్చిన ‘అఖండ 2’ సినిమా నిరాశపరిచినప్పటికి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ప్రతి సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అండర్వాల్డ్ డాన్ కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య బాబు డాన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం ముంబై నేపథ్యంలో సాగుతుందట. ఇక ఇంతకుముందు వరకు బాలయ్య చేసిన ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించిన బాలయ్య ఈ సినిమాలో మాత్రం ఒకే పాత్రను పోషిస్తున్నాడు.
అయితే ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. బాలకృష్ణ చేసిన అన్ని సినిమాల్లో కెల్లా ఈ సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుందట…బాలయ్య బాబు ముంబై నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి సినిమాను చేయలేదు. కారణం ఏంటి అంటే ఆయనతో సినిమాలు చేసిన దర్శకులు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా సినిమాలు చేశారు. కాబట్టి ఇప్పుడు కత్తులను పక్కన పెట్టి గన్స్ ను చేత బట్టినట్టుగా తెలుస్తుంది.
అండర్ వరల్డ్ డాన్ గా బాలయ్య బాబు ఏ రేంజ్ పర్ఫామెన్స్ ని చూపిస్తాడు అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట బాలయ్య బాబు నుంచి రాబోతున్న ప్రతి సినిమా ఒక సెన్సేషన్ గా నిలవబోతోంది అంటూ ప్రతి ఒక్కరు చెబుతున్నారు.
మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా బాలయ్య బాబు రేంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందా? గోపీచంద్ మలినేని దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందే వీర సింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా బాలయ్య బాబు అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి…
