Balakrishna And Anil Ravipudi: నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు… సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో చాలా మంచి సినిమాలను చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలను చేస్తూ బీ,సీ సెంటర్లో స్టార్ హీరోగా మారిపోయాడు… ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అఖండ 2 తో మంచి విజయాన్ని సాధించిన ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో సాగే ఒక కథతో సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇది ఇలా ఉంటే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది…రీసెంట్ గా ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వరించింది.
బాలయ్య బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద క్లారిటీ లేదు. రీసెంట్ గా అనిల్ రావిపూడి – బాలయ్య బాబుకి ఒక కథను వినిపించారట. ఆ కథ చాలా అద్భుతంగా ఉండడంతో బాలయ్య సైతం ఆ సినిమాని చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక క్యామియో కూడా ఉందట. ఆ క్యామియో కోసం చిరంజీవిని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి బాలయ్య ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు.
కానీ అది ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. ఇక మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవిని వెంకటేష్ ని కలిపిన అనిల్ రావిపూడి తర్వాత చేయబోయే బాలకృష్ణ సినిమాతో బాలయ్య చిరంజీవిని కలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే కనక నిజమైతే అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండావనే చెప్పాలి…