
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి అదే కథను తీసుకెళ్లి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిమేక్ చేసి ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా మారిపోయాడు. దీంతో ఇతగాడితో సినిమా చేసేందుకు సహజంగానే స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అవ్వగా మైత్రీ మూవీ మేకర్స్ తో కూడా సినిమాకు ప్రభాస్ గతంలో కమిట్ అయ్యాడు.
ఈ సినిమాను ఇప్పుడు చేయడం సాధ్యం కాకున్నా భవిష్యత్ లో చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పాడు. ఈ మేరకు కథ, దర్శకుడిని ఎంపిక చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ కు చెప్పినట్టు టాక్.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ప్రస్తుతం ‘రణబీర్ కపూర్’తో సినిమా చేస్తున్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ కుమార్ వంగ ప్రభాస్ కోసం ఒక కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి.సిరీస్ తోపాటు మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించడానికి ఓకే చెప్పాయట.. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ చెప్పే కథ ప్రభాస్ కు నచ్చితే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ప్రభాస్ తన మూడు సినిమాల తర్వాత ఈ సినిమా ఉంటుంది.