Bheemla Nayak Movie Mania: పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించడానికి సిద్ధమయ్యాడు. ఈనెల 25న ‘భీమ్లానాయక్’ మూవీ విడుదల అవుతుండడం.. ఈరోజు ప్రి రిలీజ్ వేడుక నిర్వహిస్తుండడంతో ఆ మేనియా పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా ‘భీమ్లానాయక్’ మూవీని చూడాలనే తాపత్రయం ఎక్కువైంది. ఇంటా బయటా ‘భీమ్లా నాయక్’ సందడినే కనిపిస్తోంది.
కరోనా కల్లోలం తర్వాత సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. విడుదలైన వాటిల్లో పెద్ద సినిమాలు చాలా తక్కువ. ఈ క్రమంలోనే సినిమాల కోసం ప్రేక్షకులంతా మొహం వాచి ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ నటించిన ‘భీమ్లానాయక్’ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?
హైదరాబాద్ , తెలంగాణలో కాస్త తక్కువగా ఉన్నా ఆంధ్రాలో మాత్రం పవన్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ పేరిట సర్క్యూలేట్ అయిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రా యూనివర్సిటీ లెటర్ హెడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో ఒక సర్క్యూలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఏముందుంటే.. ‘భీమ్లానాయక్ ’ ఈనెల 25న విడుదల అవుతున్న దృష్ట్యా బీటెక్, ఎంటెక్ విద్యార్థులందరికీ ఆ రోజు సెలవు ఇస్తున్నట్టుగా సర్క్యూలర్ ఉంది.
అయితే ఇది నమ్మశక్యంగా లేదు. పవర్ స్టార్ సినిమా కోసం ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు సెలవు ప్రకటించినట్టు అధికారికంగా అయితే సమాచారం లేదు. ఎవరో విద్యార్థులే దీన్ని ఫేక్ గా సృష్టించి ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే ఒక సినిమా కోసం విద్యార్థులకు సెలవు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరో తప్పుడు సర్క్యూలర్ సృష్టించినట్టుగా తెలుస్తోంది.
ఇక 25న భీమ్లా నాయక్ మూవీ విడుదల సందర్భంగా ఎలాంటి సెలువు ఇచ్చినట్టుగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ లెటర్ ఎలా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిందన్నది తేలాల్సి ఉంది.
Also Read: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లేవారికి ముఖ్య గమనిక.. ఇవి పాటించండి