Anaganaga Oka Raju Collection Day 1: నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం భోగి సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో, నవీన్ పోలిశెట్టి లాంటి హీరో సినిమా విడుదలైతే నిలబడడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కన ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కలుపుకొని 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో వివరంగా చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి కోటి 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, సీడెడ్ నుండి 56 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 74 లక్షలు, తూర్పు గోదావరి నుండి 68 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి 47 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 48 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 21 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 28 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 26 లక్షలు, 8 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 8 కోట్ల షేర్, 14 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి అన్నమాట. మొదటి వారం లోనే ఈ మార్కుని దాటి సూపర్ హిట్ రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని నవీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. నవీన్ అంతకు ముందు చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయగా,ఈ సినిమా తో మరో లెవెల్ కి వెళ్లిపోయాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.