Mana Shankara Varaprasad Garu : ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం టికెట్స్ కోసం ఏ రేంజ్ డిమాండ్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, వీకెండ్ వరకు టికెట్ ముక్క లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా టికెట్స్ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. ‘భోళా శంకర్’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నుండి ఈ రేంజ్ కం బ్యాక్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంత హైలైట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ కోసం పోటీ పడ్డ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు. ఇది కదా అసలు సిసలు సంక్రాంతి అని వీళ్ళ కాంబినేషన్ ని చూసిన తర్వాతే అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే వీళ్లిద్దరు కలిసి, అనిల్ రావిపూడి తో చేసిన ఇంటర్వ్యూ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. చాలా ఫన్నీ గా, సరదాగా సాగిపోయింది ఈ ఇంటర్వ్యూ. అనిల్ రావిపూడి మార్క్ కూడా కనిపించింది. ఇంటర్వ్యూ ప్రారంభం లో అనిల్ రావిపూడి ఒక మూలాన నిల్చొని, ఫోన్ చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి వెనుక నుండి వచ్చి అనిల్ రావిపూడి నెత్తి పై కొడుతూ ‘నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటూ ఉన్నావేంటి’ అని అంటాడు. అప్పుడు అనిల్ రావిపూడి ‘సార్ మన సినిమాకు వస్తున్న రికార్డు స్థాయి గ్రాస్, షేర్ ని చూస్తున్నాను సార్. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ మొత్తం షేక్ అవుతుంది సార్’ అని చెప్పుకొచ్చాడు. కాసేపటికి విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఇంటర్వ్యూ లో జాయిన్ అవుతాడు.
ఆయన చిరు, అనిల్ తో కలిసి చేసిన సందడి మామూలు రేంజ్ లో లేదు. ఈ చిత్రం లో వెంకటేష్ వెంకీ గౌడ గా కనిపించిన సంగతి తెలిసిందే. దీని గురించి వెంకీ మాట్లాడుతూ ‘నా పేరు ని వెంకీ గౌడ గా చేసావు. బయట అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు. నా భార్య ని కూడా నీలిమ గౌడ అని పిలుస్తున్నారు’ అంటూ వెంకటేష్ చెప్పుకొస్తాడు. నా పాటకు వెంకీ, వెంకీ పాటకు నేను డ్యాన్స్ వేయాలనే ఆలోచన నీ నుండి రావడం అద్భుతం. సినిమాలో కంటే మేము ఆఫ్ స్క్రీన్ లో చేసిన అల్లరి గురించి ఎప్పటికీ మర్చిపోలేను అని అనిల్ రావిపూడి తో అంటాడు చిరంజీవి. అప్పుడు అనిల్ రావిపూడి BTS గా ఆ ఫుటేజీ మొత్తం మేకింగ్ వీడియో లాగా త్వరలోనే విడుదల చేస్తాం సార్ అని అనిల్ రావిపూడి అంటాడు. ఆద్యంతం వినోదభరితంగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ ని మీరు కూడా చూసేయండి.