BRS MLA Disqualification : తెలంగాణలో 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌషిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు.. విచారణ త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్‌ను ఆదేశించింది. డిసెంబర్ 17న ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చారు.
ఆ ఇద్దరూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే..
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాము పార్టీలో చేరలేదని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, దీనిని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటున్నారని తెలిపారు. దీంతో స్పీకర్ ఇద్దరూ పార్టీ మారలేదని తేల్చారు. ఫిర్యాదుల్లో ఆధారాలు లేవని కారణం చెప్పారు. వీరిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు.
మొదట ఐదుగురికి రిలీఫ్
గత డిసెంబర్ 17న ఆరికెపూడి మహేశ్ గాంధీ (శేర్లింగంపల్లి), తెల్లం వెంకట్ రావు (ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) పిటిషన్లను కొట్టిపారేశారు. మొత్తం పదమంది కేసుల్లో ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు.
మిగిలింది ముగ్గురే..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కేసులు ఇంకా విచారణలో. ముగ్గురులో ఇద్దరు స్పీకర్‌ను కలవలేదు. జగిత్యాల ఎమ్మెల్యే ఆలస్యంగా వివరణ ఇచ్చారు. దీంతో త్వరలో ఆయనకూ క్లీన్‌చిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇప్పటి వరకు స్పీకర్‌ను కలవలేదు. వివరణ ఇవ్లేదు. దీంతో వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.