Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Lokesh Kanagaraj movie : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో...

Allu Arjun Lokesh Kanagaraj movie : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో చేయబోతున్న మూవీ రెండు పార్టులుగా రాబోతోందా..?

Allu Arjun Lokesh Kanagaraj movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయనతో పాటు పోటీ పడే హీరోలు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే కాకుండా బాహుబలి 2 రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసిన ఘనత తనకే దక్కుతుంది. అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త స్పెషల్ కేర్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 2 పార్టుల కథలను రెడీ చేశారట. ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండు పార్ట్ లలో కూడా చాలా వాల్యుబుల్ కథని చెప్పబోతున్నాం అనే ఒక దృఢ సంకల్పంతో అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలోని కథ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? లోకేష్ కనకరాజు ఇప్పటివరకు చేసిన కథలను మించి ఈ సినిమా కథ ఉండబోతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకుముందు అల్లు అర్జున్ ఆర్య ఆర్య 2, పుష్ప పుష్ప 2 లాంటి సిక్వెల్స్ తో ఉన్న రెండు సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు మూడోసారి అదే స్టైల్ ని రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో చాలా అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే.

మరి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం సరికొత్త మేకింగ్ విధానాన్ని అలవర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేక్షకులను సైతం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారట… లోకేష్ అల్లు అర్జున్ కి సూపర్ హిట్ అందిస్తే మాత్రం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular