https://oktelugu.com/

రూ.20 వేల కోట్లతో కేరళ ప్రత్యేక ప్యాకేజీ

కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థలు చితికిపోతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు నష్టాల్లో కూరుకుపోయాయి. లాక్ డౌన్ తో దివాలా తీస్తున్న వ్యవస్థలున్నసందర్భంలో కేరళ ప్రభుత్వం మాత్రం రూ. ఇరవై కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. దీంతో అందరికీ ఆహారం, ఉపాధి,ప్రీవ్యాక్సినేషన్ కోసం కూడా విడిగా నిధులు కేటాయించారు. పద్దెనిమిదేళ్లు దాటిన దారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రూ.15 వందల కోట్లు కేరళ సర్కారు మంజూరు చేసింది. ఉఫాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారి కోసం రూ.8,990 కోట్లు అవసరమైన వారికి లోన్లు, […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 5, 2021 / 04:03 PM IST
    Follow us on

    కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థలు చితికిపోతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు నష్టాల్లో కూరుకుపోయాయి. లాక్ డౌన్ తో దివాలా తీస్తున్న వ్యవస్థలున్నసందర్భంలో కేరళ ప్రభుత్వం మాత్రం రూ. ఇరవై కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. దీంతో అందరికీ ఆహారం, ఉపాధి,ప్రీవ్యాక్సినేషన్ కోసం కూడా విడిగా నిధులు కేటాయించారు.

    పద్దెనిమిదేళ్లు దాటిన దారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రూ.15 వందల కోట్లు కేరళ సర్కారు మంజూరు చేసింది. ఉఫాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారి కోసం రూ.8,990 కోట్లు అవసరమైన వారికి లోన్లు, వడ్డీరాయితీల కోసం రూ.8,300 కోట్లు కేటాయించారు. మొదటి రెండు దశల్లో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వీలైనంత ప్రాణనష్టం తగ్గించింది.

    మూడో దశకు కూడా ముందస్తుగా సన్నాహాలు చేస్తోంది. ప్రతి తాలూకా, జిల్లా, జనరల్ ఆస్పత్రుల్లో10 బెడ్లతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రూ.636 కోట్లు కేటాయించారు. కరోనాను ఎదుర్కోవడం అంటే ప్రకటనల్లో కాకుండా గ్రౌండ్ లో చేసి చూపిస్తున్న ప్రభుత్వంగా కేరళకు మంచి పేరుంది. తొలి దశలో కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఇబ్బంది పడ్డారేమో కానీ కేరళలో మాత్రం అలాంటి ఇబ్బందులు కలగలేదు.

    వ్యాక్సిన్ల దగ్గర్నుంచి ఏ విషయంలోనూ లోపాలకు తావివ్వలేదు. దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో అల్లాడితే కేరళ మాత్రం పొరుగు రాష్ర్టాలకు ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు ప్రజల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు నేరుగా నగదు బదిలీ కన్నా మళ్లీ వారి వ్యాపారాలు పుంజుకునేలా చేయడానికి పక్కా ప్రణాళికతో వెళ్తోంది. కేరళ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది.