Akkineni Nagarjuna : అవమానించిన డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్న అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna : ఆరోజుల్లో హాస్యభరిత చిత్రాలకు ట్రేడ్ మార్క్ గా నిలిచిన ప్రముఖ డైరెక్టర్ జంధ్యాల ఎలాగో నేటి తరం లో శ్రీనువైట్ల అలాంటి డైరెక్టర్ అని చెప్పొచ్చు..ఒకప్పుడు ఈయన సినిమాలు పొట్టచెక్కలు అయ్యే రేంజ్ కామెడీ ని రప్పించేవి..శ్రీను వైట్ల సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తారు..ముఖ్యంగా బ్రహ్మానందం ని జంధ్యాల తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న ఏకైక డైరెక్టర్ శ్రీను వైట్ల మాత్రమే. ఇప్పటికి శ్రీనువైట్ల సినిమాలకు సంబంధించిన చిన్న […]

Written By: NARESH, Updated On : January 3, 2023 9:29 pm
Follow us on

Akkineni Nagarjuna : ఆరోజుల్లో హాస్యభరిత చిత్రాలకు ట్రేడ్ మార్క్ గా నిలిచిన ప్రముఖ డైరెక్టర్ జంధ్యాల ఎలాగో నేటి తరం లో శ్రీనువైట్ల అలాంటి డైరెక్టర్ అని చెప్పొచ్చు..ఒకప్పుడు ఈయన సినిమాలు పొట్టచెక్కలు అయ్యే రేంజ్ కామెడీ ని రప్పించేవి..శ్రీను వైట్ల సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తారు..ముఖ్యంగా బ్రహ్మానందం ని జంధ్యాల తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న ఏకైక డైరెక్టర్ శ్రీను వైట్ల మాత్రమే.

ఇప్పటికి శ్రీనువైట్ల సినిమాలకు సంబంధించిన చిన్న చిన్న జిఫ్స్ మరియు మేమెలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి..అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చునే స్టేజికి పడిపోయాడంటే నమ్మశక్యం గా లేదు..అప్పటి వరకు రవితేజ , రామ్ , నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోలతో చేసి సూపర్ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల , దూకుడు సినిమాతో ఎవ్వరు ఊహించని రేంజ్ కి ఎదిగాడు.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న మహేష్ బాబు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా నిలవడమే కాకుండా శ్రీను వైట్ల ని టాప్ స్టార్ డైరెక్టర్ ని చేసింది ఈ చిత్రం..ఆ తర్వాత ఆయన వరుసగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు మహేష్ బాబు తో సినిమాలు చేసాడు..వాటిల్లో బాద్ షా మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..దీనితో శ్రీనువైట్ల కెరీర్ కి ఎండ్ కార్డు పడినట్టు అయ్యింది..ఆ తర్వాత రవితేజ తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మరియు వరుణ్ తేజ్ తో మిస్టర్ వంటి సినిమాలు చేసాడు..ఈ రెండు సినిమాలు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి..అలా కష్టకాలం లో ఉన్న శ్రీనువైట్ల కి అక్కినేని నాగార్జున ఒక అద్భుతమైన అవకాశం ని ఇచ్చాడు..త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది..అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో కింగ్ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది.

శ్రీను వైట్ల పనితనం నచ్చి తనతో ఇంకో సినిమా చేయాల్సిందిగా కోరాడు..శ్రీను వైట్ల ఓకే చెప్పాడు..దూకుడు సినిమా తర్వాత వెంటనే నాగార్జున తో సినిమా చెయ్యాల్సి ఉంది..కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావడం తో నాగార్జున ప్రాజెక్ట్ ని పక్కకి నెట్టేశాడు..నాగార్జున అప్పట్లో దీనిపై చాలా హర్ట్ అయ్యినట్టు కూడా వార్తలు వినిపించేవి..ఇప్పుడు కెరీర్ ఎండింగ్ కి వచ్చేసింది..అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేని సమయం లో నాగార్జున పిలిచి మరీ శ్రీనువైట్ల కి ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.