Homeఎంటర్టైన్మెంట్Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో..

Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో..

Akhil Die Hard Fan: సోషల్ మీడియా గత రెండు మూడు రోజులుగా ‘అయ్యగారే నెంబర్ 1’ అంటూ ఫేమస్ అయిన అఖిల్ వీరాభిమాని గురించే చర్చ. ఎందుకంటే అఖిల్ రీసెంట్ గానే ‘లెనిన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటిగా నిల్చింది. ఈ సినిమా హిట్ అవ్వగానే అందరికీ గుర్తుకు వచ్చిన మనిషి , అఖిల్ వీరాభిమాని నే. పాపం అఖిల్ ని కలవడానికి నాలుగేళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ ఇతన్ని కలవలేదు అని అఖిల్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడ్డారు. అయితే ఒక ఇంటర్వ్యూ లో అఖిల్ ఈ అభిమాని గురించి మాట్లాడుతూ , అతన్ని కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను , కానీ ఒక మంచి హిట్ ఇచ్చాక కలుద్దామని ఆగాను , లెనిన్ సక్సెస్ అయ్యాక కచ్చితంగా కలుస్తానని చెప్పుకొచ్చారు అఖిల్.

ఇచ్చిన మాట ప్రకారమే నిన్న విజయవాడ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ‘లెనిన్’ విజయోత్సవ సభ లో అఖిల్ ఈ అభిమానిని కలిశారు. ఇతన్ని కలవగానే ఆ అభిమాని కళ్ళలో ఆనందాన్నీ చూసి , ప్రతీ హీరోకి ఇలాంటి వీరాభిమాని ఉండాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ అభిమాని గురించి సోషల్ మీడియా లో తెలిసిన కొన్ని నిజాలు చూస్తే అయ్యో పాపం అని అనిపించక తప్పదు. ఇతని పేరు నాగ రాజు. నిరుపేద కుటుంబం , కొన్నేళ్ల క్రితం ఒక మీడియా రిపోర్టర్ ఇతని ఇంటికి వెళ్లి హోమ్ టూర్ చేశారు. ఆ వీడియో లో నాగ రాజు ఇంటిని చూస్తే ఎంత పేదరికంలో ఉన్నారో తెలుస్తోంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ,ఈ ఆధునిక యుగం లో ఇతనికి మొబైల్ ఫోన్ కూడా లేదట. ఈ కాలం లో మొబైల్ ని ఉపయోగించని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి.

అదే విధంగా తన ఇంట్లో కొన్ని గదులకు కరెంటు సప్లై కూడా ఉండదు అట. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళని తన రెక్కల కష్టం మీదనే చదివిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. కాగలి వ్యాపారం ఇతని వృత్తి అట, లాభాలు అంతంత మాత్రమే. ఇతన్ని అక్కినేని ఫ్యామిలీ ఆదుకుంటే బాగుంటానని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయం. నేను అక్కినేని ఫ్యామిలీ , కష్టాల్లో ఉన్నాను , నాకు సహాయం చేయండి అని ఇతను ఎప్పుడూ అడగలేదు , అడగడు కూడా. కానీ సహాయం చెయ్యాల్సిన బాధ్యత అఖిల్ పైన ఉంది. డబ్బు సహాయం కాకపోయినా , కనీసం పిల్లల్ని మంచి స్కూల్ లో చదివించే సహాయం అయినా చేస్తే బాగుంటుంది. మరి ఈ సహాయం చేస్తారో లేదో చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న నాగ రాజు హోమ్ టూర్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular