Paavala Shyamala : సీనియర్ నటి పావలా శ్యామల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు అనారోగ్యం తో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్ మానవత్వం చాటుకున్నాడు. ఆమెకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్నారు. సినీ నటుడు కాదంబరి కిరణ్ ‘ మనం సైతం ‘ ఫౌండేషన్ నిర్వాహకుడు. పావలా శ్యామల పరిస్థితి తెలుసుకుని ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు.
ఆమెకు మెరుగైన వైద్యం తో పాటు కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు. హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న పావలా శ్యామల ఇబ్బందుల పడుతున్న విషయం మీడియా ద్వారా కాదంబరి కిరణ్ తెలుసుకున్నాడు. ఆమెనువెతుక్కుంటూ వెళ్లి స్వయంగా కలిశారు. ఆమెకు సాయం అందించారు. దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు
ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరంలో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘ మనం సైతం ‘ ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం. గతంలో పావలా శ్యామలను చిరంజీవితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఆదుకున్నారు.
పావలా శ్యామల పరిశ్రమకు వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతుంది. కమెడియన్ గా ఆమె అనేక చిత్రాల్లో నటించారు. పావలా శ్యామల నటించిన చివరి చిత్రం మత్తు వదలరా. 2019 తర్వాత అనారోగ్య సమస్యలతో పావలా శ్యామల నటనకు దూరమయ్యారు.