Homeఎంటర్టైన్మెంట్Gopichand : మాజీ సీఎం జగన్ పై గోపీచంద్ సెటైర్లు..సెన్సేషనల్ గా మారిన 'విశ్వం' టీజర్!

Gopichand : మాజీ సీఎం జగన్ పై గోపీచంద్ సెటైర్లు..సెన్సేషనల్ గా మారిన ‘విశ్వం’ టీజర్!

Gopichand :  బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో గోపీచంద్ కూడా ఒకరు. ‘తొలివలపు’ అనే చిత్రంతో హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన హీరో గోపీచంద్, ఆ సినిమా సక్సెస్ కాకపోవడం తో నితిన్ తొలి చిత్రం ‘జయం’ లో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి గోపీచంద్ కి విలన్ గా విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఆయన నిజం, వర్షం చిత్రాల్లో విలన్ గా నటించాడు. అలా ఆడియన్స్ దృష్టిలో విలన్ గా ముద్ర పడిన ఒక నటుడు మళ్ళీ హీరోగా మారి స్టార్ రేస్ లోకి దూసుకొని రావడం అనేది చిన్న విషయం కాదు. గతంలో మోహన్ బాబు, కృష్ణం రాజు లాంటి వారికి ఇలా జరిగింది. వాళ్ళ తర్వాత గోపీచంద్ కి మాత్రమే జరిగింది.

‘యజ్ఞం’ సినిమాతో హీరో గా మరోసారి మొదలైన గోపీచంద్ ప్రస్థానం ఎన్నో సూపర్ హిట్స్ తో అతి తక్కువ టైం లోనే స్టార్ లీగ్ లోకి చేర్చేలా చేసింది. మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఆయన ఆ సక్సెస్ స్ట్రీక్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి, అడపాదడపా కొన్ని హిట్స్ మధ్యలో వచ్చినప్పటికీ అవి గోపీచంద్ మార్కెట్ పెంచడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆయన గత చిత్రం ‘భీమా’ కూడా కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన శ్రీను వైట్ల తో ‘విశ్వం’ అనే చిత్రం చేసాడు. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ స్టైల్ లో యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కినట్టుగా అనిపించింది. ఇది ఇలా ఉండగా శ్రీను వైట్ల తన ప్రతీ సినిమాలో ఎదో ఒక పాపులర్ సెలబ్రిటీ పై పంచులు వేస్తూ కొన్ని డైలాగ్స్, క్యారెక్టర్స్ రాస్తుంటాడు. ఈ సినిమాలో కూడా అదే చేసాడు.

ఈ టీజర్ లో ‘కొట్టారు తీసుకున్నాం..రేపు మాకు కూడా టైం వస్తుంది..మేము కూడా కొడుతాం’ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ 2014 ఎన్నికలలో జగన్ వైసీపీ పార్టీ ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ తో మాట్లాడిన మాటలు. ఇప్పటికీ ఈ డైలాగ్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇది జగన్ ని వెక్కిరిస్తూ పెట్టిన డైలాగా?, లేదా ఆయన డైలాగ్ ని మామూలుగానే వాడుకున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత అనేక మంది సినీ సెలెబ్రిటీలు, గత 5 ఏళ్లుగా జగన్ మీద దాచుకున్న కోపాన్ని మొత్తం బయటపెడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రీనువైట్ల కూడా అలాంటి ప్రయత్నం చేశాడా అనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.

Viswam Official Teaser | Gopichand | Kavya Thapar | Sreenu Vaitla | TG Vishwa Prasad | PMF

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version