Nandamuri Mokshagna : నందమూరి తారక రామారావు లెగసి తెలిసిందే. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1974లో విడుదలైన తాతమ్మ కల చిత్రంతో నటుడిగా మారాడు. టీనేజ్ లోనే ముఖానికి రంగేసుకున్నాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ బాలకృష్ణ స్టార్ హీరో అయ్యాడు. వందకు పైగా చిత్రాల్లో నటించిన బాలకృష్ణ పేరిట అనేక హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోగా.. టాలీవుడ్ పెద్దలు వేడుక నిర్వహించారు.
సెప్టెంబర్ 1న హైదరాబాద్ వేదికగా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, వెంకటేష్ తో పాటు పలువురు యంగ్ హీరోలు హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. వారికి ఆహ్వానం అందిందా లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కొన్నేళ్లుగా బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనిపై తాజా పరిణామాలతో మరింత స్పష్టత వచ్చింది.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయం అటుంచితే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఇంత కీలక ఈవెంట్ లో కనిపించక పోవడం చర్చకు దారి తీసింది. తండ్రి బాలయ్యను టాలీవుడ్ ఇంత ఘనంగా సత్కరిస్తున్న తరుణంలో మోక్షజ్ఞ ఎందుకు హాజరు కాలేదనే వాదన మొదలైంది. దీనికి ఓ బలమైన కారణం ఉందని సమాచారం. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ మేకోవర్ అవుతున్నాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ రివీల్ కాకూడదని దర్శకుడితో పాటు బాలయ్య భావిస్తున్నాడట. అందుకే మోక్షజ్ఞ ఈ వేడుకకు రాలేదట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. అదిరిపోయే కథతో ప్రశాంత్ వర్మ గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ సైతం కీలక రోల్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.
ఇక హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారట. 2025లో మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ థియేటర్స్ లోకి రానుందట. కాగా మోక్షజ్ఞ ఇప్పటికే ఆలస్యం చేశాడు. మోక్షజ్ఞ వయసు మూడు పదులకు చేరుకుంది. స్టార్ కిడ్స్ 20 ఏళ్లకే హీరోలు అవుతుండగా మోక్షజ్ఞ మాత్రం ఎందుకో వెనుకబడ్డాడు. 30 ఏళ్లకు ఎన్టీఆర్ అయితే స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.