Seetimaarr Collections : మాచో స్టార్ గోపీచంద్ ఖాతాలో సరైన హిట్ పడక చాలా ఏళ్లైంది. అప్పుడెప్పుడో వచ్చిన లౌక్యం తర్వాత.. అలాంటి సక్సెస్ అందలేదు. దీంతో.. ఎలాగైనా ‘సీటీమార్’తో హిట్ కొట్టేయాలని బలంగా ఫిక్సయ్యాడు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని.. ఓ దశలో ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ.. నిర్మాతలు థియేటర్లకే మొగ్గు చూపారు. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ నెల 10న రిలీజ్ అయ్యింది. అయితే.. అనుకున్నట్టుగానే తొలిరోజు ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికి ఐదు రోజులు ఆడింది. మరి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎంత వచ్చింది? ఎంత రావాల్సి ఉంది? అన్నది చూద్దాం.
సీటీమార్ సినిమాకు సంబంధించిన బిజినెస్ చూస్తే.. నైజాంలో 4 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల మేర బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా చూసుకున్నప్పుడు 11.50 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో.. 12కోట్ల టార్గెట్ తో థియేటర్లో అడుగు పెట్టింది సిటీమార్.
మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ ట్రెండ్స్ కనిపించాయి. వీకెండ్ లో మంచి వసూళ్లే సాధించింది. కానీ.. సోమవారం తర్వాత పరిస్థితి దిగజారింది. మంగళవారం మరింతగా కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందా? అనే చర్చ నడుస్తోంది.
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 7.46 కోట్ల షేర్ వచ్చింది. నైజాంలో 2.10 కోట్లు, సీడెడ్ లో 1.48 కోట్లు, ఈస్ట్ 77 లక్షలు, వెస్ట్ 43 లక్షలు, గుంటూరు 89 లక్షలు, కృష్ణా 44 లక్షలు, నెల్లూరు 39, ఉత్తరాంధ్రలో 96 లక్షలు వసూలయ్యాయి. రెస్టాఫ్ ఇండియాలో 29 లక్షలు, ఓవర్సీస్ లో 8 లక్షలు మాత్రమే వచ్చాయి. అమెరికాలో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇందులో ఐదో రోజు కేవలం 51 లక్షల షేర్ మాత్రమే రావడం గమనార్హం. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సాధించిన మొత్తం చూస్తే.. 7.83 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ సాధించింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడానికి ఈ చిత్రం ఇంకా 4.14 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీటీమార్ క్లీన్ హిట్ అవుతుంది. మరి, ఐదో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరో రెండు రోజులు గడిస్తే.. కొత్త సినిమాలు వచ్చేస్తాయి. కాబట్టి.. ఈ గ్యాప్ లో ఎంత రాబడుతుంది? లాభాలతో సీటీ కొట్టిస్తుందా? అన్నది చూడాలి.