https://oktelugu.com/

Pakka Commercial First Full Review: ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

Pakka Commercial First Full Review: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ మారుతి ఈ “పక్కా కమర్షియల్” సినిమా చేశాడు. ఈ సినిమా కోసం చిత్రబృందం ముందు నుంచి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఈ సినిమా […]

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2022 / 12:37 PM IST
    Follow us on

    Pakka Commercial First Full Review: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ మారుతి ఈ “పక్కా కమర్షియల్” సినిమా చేశాడు. ఈ సినిమా కోసం చిత్రబృందం ముందు నుంచి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    వారి కోసం ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ .. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఈ రివ్యూలో ఏమి చెప్పారో తెలుసుకుందాం.

    Gopichand, Raashi Khanna

    విశ్లేషణ :

    “పక్కా కమర్షియల్” మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా. ముందుగా సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, హీరో గోపీచంద్ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అలాగే, సెకండాఫ్ లో వచ్చే కోర్టు డ్రామా అండ్ కామెడీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది.

    Gopichand

    Also Read: Samantha Career In Danger: ప్రమాదం లో పడిన సమంత కెరీర్.. బయపడిపోతున్న నిర్మాతలు

    నటి నటీనటుల విషయానికి వస్తే.. గోపీచంద్ అద్భుతంగా నటించాడు. గోపీచంద్ – ప్రవీణ్ కాంబినేషన్‌ అదిరింది. రాశీ ఖన్నా లాయర్ క్యారెక్టర్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్. సినిమా కథాకథనాల విషయానికి వస్తే.. మాస్ క్లాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఫుల్ గా ఉన్నాయి. ఈ చిత్రం ఫన్ లవర్స్ కి ఫుల్ మీల్ లాంటి సినిమా.

    Gopichand

    ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ చిత్రంతో మారుతి గొప్ప ట్రీట్ ఇచ్చాడు. గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా బాగా సెట్ అయ్యింది. బన్నీవాసు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మారుతి ‘పక్కా కమర్షియల్’ పేరుతో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాశాడు.

    Gopichand

    తీర్పు :

    “పక్కా కమర్షియల్” ఒక యాక్షన్ కామెడీ డ్రామా. ఫుల్ ఫన్ తో పాటు సినిమాలో భారీ యాక్షన్ కూడా ఉంది. అన్నిటికీ మించి భారీ తారాగణం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఒక్క మాటలో ఈ సినిమా ఫన్ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ అబ్బుర పరుస్తోంది. గోపీచంద్ ఇన్నాళ్లు సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం అందుకోలేకపోయాడు. కానీ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు.

    Also Read:Prashanth Neel waiting For Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న KGF దర్శకుడు ప్రశాంత్ నీల్

    youtube.com/watch?v=ZDEsrK1ro1g

    Tags