అందుకే గోపీచంద్ మలినేనికి బాలయ్య బాబు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. రవితేజకే మాస్ హిట్ ను ఇచ్చాడు అంటే.. ఇక గోపీచంద్ మలినేని తనకు ఎలాంటి హిట్ ను ఇస్తాడో అంటూ బాలయ్యకి అతని పై నమ్మకం కుదిరింది. ఎంత నమ్మకం కుదరకపోతే.. కథ కూడా వినకుండా సినిమాకి ఓకే చెబుతాడు. కథ చెబుతాను అని గోపీచంద్ మలినేని అడిగితే.. లైన్ చెప్పండి చాలు, మీ పై నాకు నమ్మకం ఉంది. జాగ్రత్తగా సినిమాని చేయండి. మనం సూపర్ హిట్ కొట్టబోతున్నాము అంటూ మొత్తానికి తన శైలిని మరోసారి ప్రదర్శించాడు బాలయ్య. ఇలా సినిమా చేయడం ఒక్క బాలయ్యకే సాధ్యం. నిజానికి బాలయ్య అతి నమ్మకమే కొన్నిసార్లు ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది.
మధ్యలో పూర్తి కథ వినకుండా సినిమాకి ఓకే చెప్పేవాడు కాదు, వినాయక్ కి అందుకే డేట్స్ ఇవ్వలేదు. కథ బాగాలేదు అని, వినాయక్ సినిమాని రిజక్ట్ చేసాడు. అయితే, ‘క్రాక్’ సినిమాలో దర్శకుడిగా గోపీచంద్ మలినేని కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం బాలయ్యకు చాల బాగా నచ్చిందట. సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్ ఇవ్వడం లాంటి వాటిల్లో గోపీచంద్ పనితనం బాలయ్యను విపరీతంగా ఆకట్టుకుందని.. అందుకే బాలయ్య, గోపీచంద్ మలినేని దగ్గర కథ కూడా వినకుండా సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కి మైత్రి మూవీ మేకర్స్ తోడు కానున్నారు.