Homeఎంటర్టైన్మెంట్Bhimaa Pre Release Event: భీమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన...

Bhimaa Pre Release Event: భీమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన గోపిచంద్…

Bhimaa Pre Release Event: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా గోపీచంద్ స్టార్ డమ్ అనేది సపరేట్ గా ఉంటుందనే చెప్పాలి. ఈయన ఒక పాత్ర చేశాడు అంటే ఆ పాత్రలో లీనమైపోయి చేస్తాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విలన్ పాత్రల్లో అదరగొట్టిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకి సక్సెస్ లు మాత్రం పెద్దగా రావడం లేదు. ఇక దాంతో ఇప్పుడు కొత్త డైరెక్టర్ అయిన హర్ష దర్శకత్వంలో చేస్తున్న ‘ భీమా’ సినిమా మీదనే ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈనెల 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు…

ఇక అందులో గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో తను రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించబోతున్నట్టుగా తెలియజేశాడు. అలాగే తన క్యారెక్టర్ నేమ్ కూడా భీమా అనే పవర్ ఫుల్ పేరు కావడం కూడా ఈ సినిమాకి చాలా వరకు కలిసి వచ్చే అంశం అని చెప్పాడు. ఇక ఒకప్పుడు ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం ‘ సినిమాలో భద్ర అనే పేరుతో వచ్చి విలనిజాన్ని పండిస్తే ప్రేక్షకులు అందరూ తనని ఆదరించారని, అలాగే భీమా అనే మరొక పవర్ ఫుల్ నేమ్ తో వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.ఇక అప్పుడు వర్షం లోని భద్ర ని ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు భీమాని కూడా అలాగే ఆదరిస్తారనే ఆశా భావాన్ని వ్యక్తం చేశాడు…

ఇక ఈ సినిమా తనకు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతుందంటూ గోపీచంద్ మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మాట్లాడుతూ కొత్త దర్శకుడు అయిన హర్షకి ఏం కావాలో తెలుసు. నా నుంచి ఎలా యాక్టింగ్ చేయించుకోవాలో ఆయనకు మొత్తం క్లారిటీ అయితే ఉంది. దానివల్లే నాకు యాక్టింగ్ చేయడం ఈజీ అయిపోయింది అని చెప్పాడు. ఇక అలాగే ఈ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్స్ గానీ సినిమాకి హైలైట్ గా నిలువ బోతున్నట్టుగా తెలియజేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper