Dacoit Movie Box Office Collection: చాలా కాలం గ్యాప్ తర్వాత అడివి శేష్(Adivi Sesh) నుండి రీసెంట్ గానే విడుదలైన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టి , వీకెండ్ వరకు కూడా స్టడీ కలెక్షన్స్ తో దుమ్ము లేపేసింది. బుక్ మై షో యాప్ గణాంకాల ప్రకారం , ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లో 5 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడుపోయిన టిక్కెట్స్ ని కూడా కలిపితే 8 లక్షల వరకు అమ్ముడుపోయి ఉంటుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం నిర్మాతలకు తొలి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లేలా చేసిందట. ఈ సినిమాని నిర్మించడానికి దాదాపుగా 60 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారు మేకర్స్. అడివి శేష్ మార్కెట్ కి ఇది చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. పైగా మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి టాప్ నటీనటులను కూడా తీసుకున్నారు కాబట్టి , ఆ మాత్రం బడ్జెట్ ఖర్చు అవ్వడంతో వింతేమీ లేదు.
అయితే ఈ బడ్జెట్ ని విడుదలకు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ + ఆడియో + సాటిలైట్) రూపం లో 48 కోట్ల రూపాయిలు రీకవరీ చేసింది. ఇక థియేటర్స్ నుండి 12 కోట్ల రూపాయిల షేర్ వస్తే నిర్మాత సేఫ్ అయ్యినట్టే. మొదటి మూడు రోజుల్లో తెలుగు + హిందీ వెర్షన్స్ కి కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చాయి. అంటే నిర్మాతకు మొదటి మూడు రోజుల్లోనే 5 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా మొదటి మూడు రోజుల్లో ఎంత గ్రాస్ వచ్చిందో చూద్దాం. తెలంగాణ ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి 8 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ఆంధ్ర + సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక ప్రాంతం నుండి 2 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి ఏకంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం తెలుగు వెర్షన్ నుండి మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 27 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా ఈ చిత్రానికి హిందీ వెర్షన్ నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి 32 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.