https://oktelugu.com/

ప్రభాస్‌ ప్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. రాధేశ్యామ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఇండియా నయా సూపర్ స్టార్ మన యంగ్‌ రెబల్‌ స్టార్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. అతని సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం ఎదురు చూస్తోంది. బాహుబలి తర్వాత టాలీవుడ్‌ డార్లింగ్‌ చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీస్‌గా రిలీజ్‌ అవుతున్నాయి. ఇప్పటికే ‘సాహో’ దేశం మొత్తాన్ని షేక్‌ చేసింది. తెలుగులో అంతగా ఆడకపోయినప్పటికీ బాలీవుడ్‌లో దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. ‘జిల్‌’ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2020 / 02:59 PM IST
    Follow us on


    ఇండియా నయా సూపర్ స్టార్ మన యంగ్‌ రెబల్‌ స్టార్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. అతని సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం ఎదురు చూస్తోంది. బాహుబలి తర్వాత టాలీవుడ్‌ డార్లింగ్‌ చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీస్‌గా రిలీజ్‌ అవుతున్నాయి. ఇప్పటికే ‘సాహో’ దేశం మొత్తాన్ని షేక్‌ చేసింది. తెలుగులో అంతగా ఆడకపోయినప్పటికీ బాలీవుడ్‌లో దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్‌’ కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది. కొన్ని రోజుల కిందట రిలీజైన ‘రాధేశ్యామ్‌’ అనే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

    Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !

    రాయల్ కాస్టూమ్స్‌లో ప్రభాస్‌, పూజా హెగ్డే రొమాంటిక్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్రభాస్‌, పూజా ఇద్దరూ డ్యుయల్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముందు వరకూ జార్జియాలో ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగింది. కానీ, కరోనా కారణంగా మార్చిలో అర్ధంతరంగా చిత్రీకరణ ఆగిపోయింది. అప్పటి నుంచి షూటింగ్‌ మళ్లీ ఎప్పుడు మొదలువుతుంది… ప్రభాస్‌ ను తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసినా అది సాధ్యపడలేదు. దాంతో, అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, వాళ్లలో ఉత్సాహం నింపే విషయం చెప్పాడు దర్శకుడు రాధా కృష్ణ. సెప్టెంబర్ రెండో వారం నుంచి రాధేశ్యామ్‌ షూటింగ్‌ తిరిగి మొదలవుతుందని తెలిపాడు. ‘సెప్టెంబర్ రెండో వారం నుంచి షూటింగ్‌ మళ్లీ మొదలు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాం. మా డార్లింగ్‌ ప్రభాస్‌, పూజా హెగ్డేతో లాంగెస్ట్‌, లవ్లీయెస్ట్‌ షెడ్యూల్‌ చేయబోతున్నాం’ అని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసే ప్రత్యేక సెట్స్‌లో జరిగే షూటింగ్‌లో ప్రభాస్‌, పూజాతో పాటు ఇతర ప్రధాన పాత్రధారులు పాల్గొంటారు. ఈ మూవీని 2021 వేసవిలో విడుదల చేయనున్నారు. బాహుబలి రిలీజైన ఏప్రిల్‌ 24వ తేదీనే దీన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో భారీ బజ్జెట్‌ చిత్రానికి రెబల్‌ స్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అశ్వినీదత్‌ పాన్‌ ఇండియా మూవీగా నిర్మించే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ను హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే, బాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్ ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’లో కూడా ప్రభాస్‌ నటిస్తున్నాడు.