ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

బాహుబలి సిరీస్‌ తర్వాత రాజమౌళి రేంజ్‌ మారిపోయింది. ఈ రెండు చిత్రాలు కలిపి 2 వేల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడడంతో ఇండియాలో మోస్ట్‌ వాంటెండ్‌ డైరెక్టర్ గా మారిపోయాడు రాజమౌళి. బాహుబలి తర్వాత గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ లేని ఓ చిన్న సినిమా తీయాలనుకున్నాడయాన. కానీ, దాదాపు రెండేళ్లు వేచి ఉన్నా అలాంటి కథ దొరకలేదు. ఈ లోపు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అద్భుతమైన కథ రెడీ చేశారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, […]

Written By: Neelambaram, Updated On : August 23, 2020 3:17 pm
Follow us on


బాహుబలి సిరీస్‌ తర్వాత రాజమౌళి రేంజ్‌ మారిపోయింది. ఈ రెండు చిత్రాలు కలిపి 2 వేల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడడంతో ఇండియాలో మోస్ట్‌ వాంటెండ్‌ డైరెక్టర్ గా మారిపోయాడు రాజమౌళి. బాహుబలి తర్వాత గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ లేని ఓ చిన్న సినిమా తీయాలనుకున్నాడయాన. కానీ, దాదాపు రెండేళ్లు వేచి ఉన్నా అలాంటి కథ దొరకలేదు. ఈ లోపు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అద్భుతమైన కథ రెడీ చేశారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ యవ్వనంలో కలుసుకుంటే ఎలా ఉంటుందన్న ఊహాత్మక కథ అల్లారు. ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు రాజమౌళి. వర్కింగ్‌ టైటిల్‌ ఆర్ఆర్ఆర్ ను రౌద్రం రణం రుధిరం అని పేరు అనౌన్స్‌ చేశారు. ఆపై సీతారామరాజు గెటప్‌లో రామ్‌ చరణ్‌ టీజర్ ను ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేశారు. ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also Read: ప్రభాస్‌ ప్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. రాధేశ్యామ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అప్పటి నుంచి ఎన్టీఆర్ కొమురం భీమ్‌ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్‌ బర్త్‌డే రోజు టీజర్ వస్తుందని ఆశించారు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా విజువల్‌ ఎఫెక్ట్‌ టీజర్ను రిలీజ్‌ చేయలేకపోయారు రాజమౌళి. దాంతో తారక్‌ ఫ్యాన్స్‌ చాలా నిరాశ చెందారు. అలాగే, మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. ఆ మధ్య తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేశారు కానీ, రాజమౌళి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అయితే, దిగ్గజ దర్శకుడు సహా ఆయన కుటుంబం ఈ మహమ్మారిని జయించింది. ఇక, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సహా కొన్ని సినిమాలు తిరిగి సెట్స్‌ మీదకు వెళ్తుండడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ కూడా తొందర్లోనే మళ్లీ మొదలవుతుందని ఫిల్మ్‌ నగర్ సమాచారం. దీనిపై రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఎన్టీఆర్ కొమురం భీమ్‌ టీజర్ పై కొంత క్లారిటీ ఇచ్చారు.

షూటింగ్‌ తిరిగి మొదలైన వెంటనే ఎన్టీఆర్ పై కొన్ని ఎపిసోడ్స్‌ చిత్రీకరించాల్సి ఉందన్నాడు. దానికి 15 రోజుల సమయం అవసరం అన్నాడు. ఈ షూట్‌ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ టీజర్ పై అప్‌డేట్‌ ఇస్తామని స్పష్టం చేశాడు. ఆర్ఆర్ఆర్ లో మిగిలిన షూటింగ్‌ పూర్తి చేయడానికి 6-7 నెలలు పడుతుందన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫస్ట్‌ లుక్‌ టీజర్ విడుదల తేదీని ప్రకటించలేనని చెప్పాడు.

Also Read: డిజిటల్ విప్లవంలో రేపటి సినిమాల పరిస్థితి !

ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రంలో ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. బాలీవుడ్‌ స్టార్లు అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌తో పాటు సముద్రకని, శ్రియా శరణ్‌ కీలక పాత్రలు పోషిస్తునారు. హాలీవుడ్‌ యాక్టర్లు రే స్టీవెన్సన్‌, అలీసన్‌ డూడీ కూడా నటిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది చిత్ర బృందం. కానీ, రెండు మూడు నెలల్లో షూటింగ్‌ ప్రారంభమైతేనే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే 2022కి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 300 నుంచి 400 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.