https://oktelugu.com/

డిజిటల్ విప్లవంలో రేపటి సినిమాల పరిస్థితి !

కరోనా దెబ్బకు డిజిటల్ విప్లవం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పుడు యువత అంతా, డిజిటల్ జనరేషన్ లానే మారిపోతున్నారు. అందుకే.. సినిమా కూడా డిజిటల్ అయిపోయింది. కరోనాకి ముందువరకూ సినిమా చూడాలి అంటే, థియేటర్స్ లోనే చూడాలి. లేకపోతే ఆ అనుభూతి మిస్ అవుతాం అనుకున్నే రోజులు పోయాయి. రేపు కరోనా అనంతరం కూడా ప్రేక్షకులు ఇలా అనుకోవచ్చు ఏమో. థియేటర్స్ కి వెళ్లి ఆ గోలలో కేకల మధ్య సినిమా చూడాలా..? అని, ఇలానే అనుకుంటారనేది సినీ […]

Written By:
  • admin
  • , Updated On : August 23, 2020 2:50 pm
    Follow us on


    కరోనా దెబ్బకు డిజిటల్ విప్లవం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పుడు యువత అంతా, డిజిటల్ జనరేషన్ లానే మారిపోతున్నారు. అందుకే.. సినిమా కూడా డిజిటల్ అయిపోయింది. కరోనాకి ముందువరకూ సినిమా చూడాలి అంటే, థియేటర్స్ లోనే చూడాలి. లేకపోతే ఆ అనుభూతి మిస్ అవుతాం అనుకున్నే రోజులు పోయాయి. రేపు కరోనా అనంతరం కూడా ప్రేక్షకులు ఇలా అనుకోవచ్చు ఏమో. థియేటర్స్ కి వెళ్లి ఆ గోలలో కేకల మధ్య సినిమా చూడాలా..? అని, ఇలానే అనుకుంటారనేది సినీ పండితుల ఊహ. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకి తప్ప.. ఇక చిన్నాచితకా చిత్రాలకు జనం థియేటర్స్ కి రారనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న ప్రధాన టాక్.

    Also Read: ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!

    అన్నిటికి మించి జనంలో స్మార్ట్‌ ఫోన్ల వాడకం వేగంగా పెరిగింది. పైగా సినిమాల పట్ల నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుందని.. ఇప్పుడు అంతా వరల్డ్ సినిమాని చూస్తున్నారని.. ఆ సినిమాల ప్రభావం ప్రేక్షకుల్లో ఎక్కువుగా పడే అవకాశం ఉందని, కచ్చితంగా మన సినిమాలకు ఇది నష్టం కలిగించేదే అని ఇలా చాలా మాటలే వినిపిస్తున్నాయి. అందుకేమో ఇక అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ స్టార్స్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు.

    Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !

    ఇప్పటికే ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ కోసం కొరటాల శివ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక వెబ్ సిరీస్ ను, వంశీ పైడిపల్లి సహకారంతో రెండు వెబ్ సిరీస్‌ లు రాబోతున్నాయి. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు. అదే విధంగా వేణు ఉడుగుల, అనిల్ రావిపూడి, చందు మెండేటి, సుకుమార్, వినాయక్ లాంటి వారు ఆహా కోసం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ డిజిటల్ విప్లవంలో రేపటి సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయేలా కనిపిస్తోంది.