Good Bad Ugly
Good Bad Ugly: తమిళనాడు లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రికార్డులను నెలకొల్పే సత్తా ఉన్న ఏకైక హీరో తల అజిత్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఆయన. యూత్, మాస్ ఆడియన్స్ అజిత్(Thala Ajith) సినిమాలంటే మెంటలెక్కిపోతుంటారు. ఆయన గత చిత్రం ‘విడాముయార్చి'(Vidaamuyaarchi Movie) కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వేరే హీరో కి అయితే ఈ సినిమా ఫలితం తాలూకు ప్రభావాన్ని గట్టిగా అనుభవించేవాడు. కానీ అజిత్ పై ఈ ఫ్లాప్ ప్రభావం ఇసుమంత కూడా పడలేదు. ఆయన హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఈ నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇటీవల కాలంలో అజిత్ కెరీర్ లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిదే.
Also Read: ఎంపురాన్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..300 కోట్లకు అతి చేరువలో!
ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొన్న రాత్రి గ్రాండ్ గా మొదలు పెట్టారు. కొన్ని సెలెక్టెడ్ సింగల్ స్క్రీన్స్, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో మాత్రమే బుకింగ్స్ ని మొదలు పెట్టారు. కేవలం ఈ స్క్రీన్స్ నుండే ఈ చిత్రానికి 1800 షోస్ కి గాను 6 కోట్ల 17 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. పూర్తి స్థాయిలో నేడు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే లెక్క ఏకంగా 20 కోట్ల వద్ద ఆగుతుంది. ఫైనల్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ పాతిక కోట్ల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమా తమిళనాడు ప్రాంతంలో మొదటి రోజు 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే మొట్టమొదటి చిత్రంగా నిలుస్తుందని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది నేడు అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభించిన తర్వాత అర్థం కానుంది.
ఇకపోతే మొన్న రాత్రి విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి 38 మిల్లియన్లకు పైగా వ్యూస్, 6
లక్షల 47 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా అజిత్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని, ఇలాంటి యాక్షన్ కమ్ కమర్షియల్ సినిమా చేసి అజిత్ చాలా కాలం అయ్యిందని అంటున్నారు. అంతే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సినిమాగా కూడా ఇది నిలుస్తుందని అంటున్నారు. కానీ తమిళనాడు ప్రాంతంలో జరుగుతన్న అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్ లో ఓవర్సీస్ లో జరగడం లేదు, కాబట్టి 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు.