Good Bad Ugly : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Thala Ajith Kumar) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, అజిత్ కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ ఓపెనింగ్ ని రాబట్టిన సినిమాగా నిలబడింది. తమిళనాడులో ఈ చిత్రానికి మొదటి రోజు 31 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తమిళనాడు రాష్ట్రంలో ఒకప్పుడు ఉన్నట్టుగా అదనపు షోస్ లేకపోవడం వల్ల ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్ప లేకపోయింది కానీ, లేకపోతే మొట్టమొదటి 40 కోట్ల సినిమాగా నిలిచేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
Also Read : చరిత్ర తిరగరాసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే!
బుక్ మై షో(Book My show) యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి 3 లక్షల 55 వేల టికెట్స్ అమ్ముడుపోగా, రెండవ రోజు 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. కేవలం తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి రెండవ రోజు 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతూ ముందుకు వెళ్తుంది, ఒక్క నార్త్ అమెరికాలో తప్ప. ఈ ఒక్క చోట అజిత్ చాలా వీక్ గా కనిపిస్తున్నాడు. రజినీకాంత్, విజయ్ లకు కనీసం దరిదాపుల్లో కూడా కనిపించకపోవడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేస్తుంది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు కూడా అవలీల గా నార్త్ అమెరికా లో రెండు మూడు రోజుల్లో 1 మిలియన్ మార్కుని అందుకుంటున్నారు. కానీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ఇప్పటికీ ఇక్కడ 1 మిలియన్ మార్కుని అందుకోలేదు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ఓవర్సీస్ మర్కెట్స్ లో రెండు రోజులకు కలిపి 3.18 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 23 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అన్నమాట. నార్త్ అమెరికా లో కాస్త తక్కువ వసూళ్లు వచ్చినప్పటికీ, ఇతర ఓవర్సీస్ మార్కెట్స్ లో భారీ వసూళ్లు వస్తున్నాయి. శనివారం, ఆదివారం రోజున ఓవర్సీస్ మార్కెట్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ వీకెండ్ తో కచ్చితంగా ఆరు మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని, ఫుల్ రన్ లో కచ్చితంగా పది మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విడాముయార్చి లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత అజిత్ ఈ రేంజ్ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు కూడా ఊహించలేదు.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…