Golden Globes 2025: కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేవెర్స్లీ హిల్స్ వేదికగా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఘనంగా జరుగుతుంది. వివిధ విభాగాల్లో నామినేట్ అయిన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటిస్తున్నారు. ఈసారి ఫ్రెంచ్ కామెడీ క్రైమ్ డ్రామా ఎమీలియా పెరెజ్ అత్యధికంగా 10 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కితే దాదాపు ఆస్కార్ గెలిచినట్లే అని భావిస్తున్నారు.
గతంలో ఇండియాకు చెందిన స్లమ్ డాగ్ మిలియనీర్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకుంది. అలాగే ఆస్కార్ సైతం సొంతం చేసుకుంది. తెలుగు సినిమా ఆస్కార్ గెలుచుకోవడం అనూహ్య పరిణామం. ఈ ఏడాది ‘ఆల్ వి ఇమాజైన్ ఆజ్ లైట్’ చిత్రం రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ కేటగిరీలు బరిలో నిలిచింది. కానీ అవార్డు దక్కలేదు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025 వినర్స్ లిస్ట్…
బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా – బ్రూటలిస్ట్
మోస్ట్ మోషన్ పిక్చర్ మ్యూజికల్/ కామెడీ- ఎమీలియా పెలెజ్
బెస్ట్ మోషన్ పిక్చర్ యానిమేటెడ్-ఫ్లో
బెస్ట్ మోషన్ పిక్చర్, నాన్ ఇంగ్లీష్ – ఎమీలియా పెరేజ్
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ మోషన్ పిక్చర్ డ్రామా- ఫెర్నాండ టోర్రెస్(ఐ యామ్ స్టిల్ హియర్)
బెస్ట్ పెర్ఫార్మన్స్ బై ఆన్ యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్ డ్రామా-ఆడ్రీన్ బ్రాడి(ది బ్రుటలిస్ట్)
బెస్ట్ పెర్ఫార్మన్స్ బై యాన్ యాక్ట్రెస్ ఇన్ మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీ- డెమి మోర్(ది సుబ్స్టెన్సు)
బెస్ట్ పెర్ఫార్మన్స్ బై యాన్ యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీ -సెబాస్టియన్ స్టాన్(ఏ డిఫరెంట్ మాన్)
బెస్ట్ పెర్ఫార్మన్స్ బై యాన్ యాక్ట్రెస్ ఇన్ సుప్పొర్టింగ్ రోల్ మోషన్ పిక్చర్ – జో సల్దాన(ఎమీలియా పెరేజ్)
బెస్ట్ పెర్ఫార్మన్స్ బై యాన్ యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్- కీరన్ కూల్కిన్ (ఏ రియల్ పెయిన్)
బెస్ట్ డైరెక్టర్ మోషన్ పిక్చర్- బ్రాడీకార్బెట్(ది బ్రుటలిస్ట్)
బెస్ట్ స్క్రీన్ ప్లే మోషన్ పిక్చర్-పీటర్ స్ట్రాగన్(కాన్క్లేవ్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రోర్, మోషన్ పిక్చర్-ట్రెంట్ రేజ్నార్ అండ్ అట్టికస్ రాస్(ఛాలెంజర్స్)బెస్ట్ ఒరిజినల్ సాంగ్, మోషన్ పిక్చర్- ఎల్ మాల్ (ఎమీలియా పెరెజ్)