Canada: కెనడా ప్రధాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయన లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉందని ది గ్లోబ్ అండ్ మెయిల్ సంస్థ నివేదించింది. సోమవారం పదవి నుంచి వైదొలగవచ్చని ఆదివారం నివేదించింది. ట్రూడో తన నిష్క్రమణ ప్రణాళికను ప్రకటిసాత్డో కచ్చితంగా తెలియదని పేర్కొంది. ఈ బుధవారం(జనవరి 8న) జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు పదవి నుంచి వైదొలుగుతారని భావిస్తున్నారు. అయితే కెనడియన్ ప్రధాని కార్యాలయం సాదారణ పనివేళల్లో వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థలపై స్పందించలేదు. అయితే ట్రూడో వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోతారా.. లేక కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా అనేది నివేదిక పేర్కొనలేదు.
2013లో బాధ్యతలు..
2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ట్రూడో లిబరల్ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు మరియు హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొదటిసారి మూడవ స్థానానికి దిగజారారు. ఈ ఏడాది అక్టోబర్ చివరన కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో లిబరల్స్ కన్జర్వేటివ్ పార్టీ చేతిలో ఘోరంగా ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో ట్రూడో వైదొలగడం, పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకుండా పోతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను రాబోయే నాలుగేళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనాల్సిన నేపథ్యంలో ట్రూడో రాజీనామా ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఆధిపత్యానికి తలొగ్గినట్లుగా ఉంది. నూతన ప్రధానిగా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఆయన కూడా ప్రధాని పదవికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. లెబ్లాంక్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.
భారత్‌తో గొడవ ప్రభావం..
ట్రోడో ఓటమికి భారత్‌తో గొడవ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి ఎన్నికల్లో మద్దుతు పొందేందుకు ట్రూడో ప్రయత్నించారు. కానీ అవన్నీ బెడిసి కొడుతున్నాయి. పైగా అతనిపై సొంత దేశంలోనే వ్యతికేకత పెరుగుతోంది. సిక్కులు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రూడో భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.