Game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న సినిమాల విషయంలో చాలామంది ప్రేక్షకులు ఆ సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారు. తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి గుర్తింపును అందుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. మరి మరోసారి ఈ సినిమాతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తాడా? లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. కానీ సంక్రాంతి బరిలో నిలుస్తున్న రామ్ చరణ్ సంక్రాంతి విన్నర్ గా మారతాడా? లేదా అనే విషయంలోనే మెగా అభిమానులు సైతం కొంతవరకు తడబడుతున్నారు.
ఎందుకంటే శంకర్ కి ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లైతే లేవు. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ మరోసారి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నట్లైతే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఒకవేళ సినిమా సక్సెస్ ని సాధించకపోతే మాత్రం అటు శంకర్ కి, ఇటు రామ్ చరణ్ కి భారీగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్న దర్శక నిర్మాతలకి ఈ సినిమా ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుంది. తద్వారా ఈ సినిమాతో వాళ్లకు ఎంతవరకు ప్రాఫిట్ వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది…