Godfather Pre Release Event in Anantapur: ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నానుంచి రాజకీయం దూకం కాలేదు’ ఈ ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో సచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి.. గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్‌తో మరోమారు తెలుగు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక్క డైలాగ్‌ను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పకున్న మెగాస్టార్.. ఇప్పుడు సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ప్రీ రిలీజ్ ద్వారా సంకేతం పంపారు. అయితే ఇందులో తన రోల్ ఎలా ఉంటుంది… సల్మాన్‌ఖాన్ పాత్ర ఏమిటి అనేది ఆసక్తి రేకెత్తించేలా ప్రీరిలీజ్ లాంచ్ చేశారు.

జన జాగృతి పార్టీ..
అక్టోబర్ 5న రిలీజ్ అయ్యే మెగాస్టార్ చిరంజీనవి సినిమా గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ద్వారా నిర్మాతలు, చిరంజీవి పొలిటికల్ హైప్ తీసుకొచ్చారు. సినిమా మొత్తం రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. చిరంజీవి డైలాగ్‌లు, నయనతార డైలాగ్‌లు చూస్తుంటే ఇది అందరికీ అర్థమవుతుంది. సగటు అభిమానికి కూడా అర్థమయ్యేలా ప్రీ రిలీజ్ లాంచ్ చేశారు. ఇందులో అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ అభిమానులను ఆకట్టుకునేలా జన జాగృతి పేరుతో పార్టీ ఉన్నట్లు.. అది చిరంజీవి పార్టీ అనిపించేలా ప్రోమోలో ఉంది. ‘జన’ అనగానే అందరికీ గుర్తొచ్చేది మెగా పవర్‌స్టార్ పార్టీ జనసేన. ఇక జాగృతి అనగానే గుర్తొచ్చేది తెలంగాణ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గుర్తుకు వస్తుంది. జాగృతి పేరుతో ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేశారు. దీంతో సినిమాలో రెండు రాష్ట్రాల అభిమానులను మెప్పించేలా, పొలిటికల్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నట్ల తెలుస్తోంది.
అందుకే అనంతపూర్‌లో..
మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో చిరు రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి లుక్ రఫ్‌లుక్‌తో కేక పుట్టిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఇప్పుడు అధికారిక అప్డేట్ బయటకి వచ్చేసింది. అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఈ వేడుకలు నిర్వహించారు. తద్వారా చిరంజీవి వచ్చే ఎన్నికల్లో తన మద్దతు జనసేనకు అని చెప్పకనే చెప్పారు. ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వస్తారని అంతా అనుకున్నారు. కానీ పవన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన రావడం లేదని తెలిసింది. నయనతార వివాహమైన తర్వాత ఒక్కసారి కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా ద్వారా నయన్, సల్మాన్ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతున్నారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం కానున్నాయి. ఇక గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్నారు. సినిమాను చిరు ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మోహన్ రాజా. ఇందులో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరుతో సల్మాన్ ఖాన్ స్టెప్పులు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటుందని చెబుతున్నారు.
[…] […]
[…] […]