Goa beauty Ileana: ఇలియానా ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది. సినిమా అవకాశాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ గోవా బ్యూటీకి కాలం కలిసి రావడం లేదు. అయినా ఎప్పటికప్పుడు ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ఇలియానా నెటిజెన్స్ కి షాక్ ఇస్తూ ఉంటుంది. అన్నట్టు ఇలియానా తన కెరీర్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను ఫేడ్ అవుట్ అయిపోయాను అంటూ తెగ ఫీల్ అయిపోతుంది.
ఆమె మెసేజ్ చూసిన అభిమానులు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. త్వరగా మళ్ళీ ఫామ్ లోకి రావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన ఇలియానా.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా ఫామ్ లోకి వస్తాను. మీ ముందుకు వస్తాను అంటూ ఆమె తెలిపింది. ఏది ఏమైనా మాజీ బ్యూటీలు ఛాన్స్ లు లేకపోయినా చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు.

ఇక ఇలియానా వేదాంతం కూడా చెబుతుంది. జీవితం చాలా చిన్నది, నచ్చినట్లు బ్రతకడమే తన సిద్ధాంతం అంటుంది ఈ అమ్మడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం ఏ కోశాన ఆమెకు ఉండదు. ఆమె సమాజాన్ని అస్సలు పట్టించుకోదు. నచ్చిన పని పబ్లిక్ గా చేసేస్తూ ఉంటుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ బిగినింగ్ లో అమ్మడుకి సరైన బ్రేక్ రాలేదు. నటించిన చిత్రాలన్నీ పరాజయం కావడంతో ఐరన్ లెగ్ అన్న నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది.
Also Read: Radhe Shyam- Bheemla Nayak Box Office Collection: తేలిపోయిన ప్రభాస్.. నైజాం నవాబ్ పవనే
అయితే ఇలియానా త్వరలో పుంజుకుంటుంది అట. భారీ చిత్రాలు తనకు వస్తున్నాయి అని, అవి భారీ విజయాలను తనకు అందిస్తాయి అని చెబుతుంది ఇలియానా. ఏది ఏమైనా మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో ప్రేమ పిచ్చిపట్టి లండన్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం కొత్త ప్రియుడు వేటలో ఉంది. ప్రస్తుతం ఇలియానా ముంబైలోనే ఉంటుంది.
Also Read: Janasena Formation Day: నేడే జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ ఏం చెప్పనున్నారు?
[…] […]