KGF 2 1st Day Collections: యావత్తు భారత దేశ సినీ ప్రియులందరు ఎప్పుడెప్పుడా అన్ని వెయ్యి కళ్ళతో ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూసిన KGF చాప్టర్ 2 ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ మరియు ట్రైలర్ తో అభిమానుల్లో ఒక్క రేంజ్ అంచనాలను పెంచిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి ప్రేక్షకులందరికీ బెస్ట్ సినిమాటిక్ అనుభవం ని ఇచ్చారు..హీరోయిజమ్ కి సరికొత్త నిర్వచనం లా నిలిచినా KGF చాప్టర్ 1 తో పోలిస్తే KGF చాప్టర్ 2 పదింతలు ఎక్కువ మాస్ గా చూపించి సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రశాంత్ నీల్..మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ‘తుఫాన్’ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు ఈ సినిమాకి ప్రతి బాషా లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాల మతి పోయింది అనే చెప్పొచ్చు..ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కి వచ్చిన మొదటి రోజు వసూళ్ల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా హిందీ వెర్షన్ నార్త్ ఇండియా లో కలెక్షన్ల సునామి సృష్టించింది అనే చెప్పాలి..హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు అనే విషయం బహుశా ఆ చిత్ర మేకర్స్ కూడా ఊహించి ఉండరు ఏమో..ఎందుకంటే KGF చాప్టర్ 1 ఇక్కడ ఫుల్ రన్ లో కేవలం 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే దక్కించుకుంది..కానీ KGF చాప్టర్ 2 మాత్రం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపుగా 40 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చెయ్యడం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది..ఒక్క రేంజ్ క్రేజ్ ఉన్న ఈ సినిమాకి అగ్ని కి వాయువు తోడు అయినట్టు ఈ సినిమాకి ఈరోజు హాలిడే కలిసి రావడం తో అన్ని ప్రాంతాలలో కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది..నార్త్ ఇండియా లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి 90 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 70 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వార్త..ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరుకు బాలీవుడ్ ని దశాబ్దాల నుండి ఏలుతున్న ఖాన్స్ కి కూడా ఇప్పటి వరుకు సాధ్యపడలేదు అని చెప్పొచ్చు.

Also Read: KGF 2 Telugu Movie Review:`కేజీఎఫ్ 2′ రివ్యూ
తెలుగు లో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లోనే జరిగాయి అని చెప్పొచ్చు..ముఖ్యంగా నైజం ప్రాంతం లో ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి..ఈ ప్రాంతం లో ఇటీవల విడుదల అయిన పుష్ప , భీమ్లా నాయక్ మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలు దాదాపుగా మొదటి రోజు 11 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించాయి..ప్రస్తుతం నాన్ #RRR డే 1 రికార్డుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఉంది..ఈ సినిమా మొదటి రోజు ఇక్కడ 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇప్పుడు KGF చాప్టర్ 2 కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే ఈ సినిమా నైజం ప్రాంతం లో మొదటి రోజు 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..#RRR వల్ల KGF చాప్టర్ 2 కి ఇక్కడ థియేటర్స్ కొరత ఉంది..లేకపోతే ఈ సినిమా మొదటి రోజు ఇక్కడ 15 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉండేది అని అంచనా..ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమా కి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..అలాగే కర్ణాటక ప్రాంతం లో 30 కోట్ల;ఆ రూపాయిల గ్రాస్ మరియు తమిళ నాడు లో 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా మొదటి రోజు కచ్చితంగా వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 180 నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?
[…] Also Read: KGF Chapter2 మొదటి రోజు వసూళ్లు […]